‘ఏమాయ చేశావే’ సినిమాతో కుర్రకారుని తనదైన మాయలో పడేసింది సమంత. ఆ సినిమా నుండి వెనుకకు తిరిగిచూడలేదు ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఆమెతో నటించిన మొదటి హీరో నాగ చైతన్యనే పెళ్లిచేసుకుంది సమంత. ప్రస్తుతం ఆమె తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరు. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా వుంటుంది. తనకు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అకౌంట్‌లు ఉన్నాయి. తెలుగులో ఏ హీరోయిన్‌కు ఇంకా చెప్పాలంటే.. టాప్ హీరోలకు కూడా లేనంత ఫాలోయింగ్ ట్విట్టర్‌లో సమంతకు ఉంది. అది అలా ఉంటే సమంత తన సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. చేయి తలపై పెట్టుకొని.. దిగాలుగా చూస్తూ.. ఇలా ఎందుకు ఉన్నానో మాత్రం అడగకండి.. అంటూ రాసుకుంది. దీంతో ఆమె అభిమానులు ఏమైందీ సమంత అంటూ తెగ వర్రీ అవుతూ.. కామెంట్స్ పెడుతున్నారు.