28.2 C
Hyderabad
April 20, 2024 12: 30 PM
Slider విశాఖపట్నం

విశాఖ సముద్ర తీరంలో ఏం జరుగుతున్నది?

#RishkondaBeach

విశాఖపట్నం జిల్లా ఋషికొండ తీరంలో చచ్చిపోయిన చేపలు కొట్టుకురావడంతో తీవ్ర ఆందోళన కలుగుతున్నది. తీర ప్రాంతంలో వాతావరణ మార్పులు ఏర్పడిన అనూహ్య పరిస్థితులు సముద్ర జీవులు తట్టుకోలేని విధంగా రూపొంది ఉంటాయని అంటున్నారు.

వాతావరణ మార్పులు రీత్యా మత్స సంపదకు భారీగా గండం ఏర్పడింది. సముద్రంలో తుఫాను కేంద్రీకృతం కావడం కూడా వాతావరణ మార్పులకు కారణం కావచ్చునని అంటున్నారు. ఋషికొండ తీరానికి నేడు మరణించినవి కొన్ని, కొన ఉపిరితో కొన్ని చేపలు కొట్టుకు వచ్చాయి.

దాంతో  సముద్ర తీరంలో మత్స్యకారులు వీటిని చూసి  తమ సంచుల్లో నింపుకున్నారు. సముద్రంలో కలుషిత నీరు కలవడం వల్ల కావచ్చు లేదా ఏదైనా  రసాయన ప్రక్రియ మూలంగా  నీటిలోని మార్పులు వలన చేపలు  చాలావరకు చనిపోయి ఉండవచ్చని మత్య్స శాఖ అధికారులు చెబుతున్నారు.

ఈ రుషికొండ  తీరానికి చేపలు కొట్టుకు రావడంతో తీర ప్రాంతంలో భారీగా జనాలు చేరి ఈ చేపలు పట్టే పనిలో పడ్డారు.

Related posts

గుంటూరులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం

Satyam NEWS

శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల విడుదల

Bhavani

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని దూషించిన బీజేపీ ఎంపి

Satyam NEWS

Leave a Comment