27.7 C
Hyderabad
March 29, 2024 04: 38 AM
Slider ప్రపంచం

ఏ కంపెనీ వ్యాక్సిన్ ఏ దశలో ఉందో తెలుసా?

#CoronaVaccine

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చేస్తున్న ప్రకటనలతో దేశంలో కరోనా వ్యాక్సిన్ పై ఆసక్తి పెరిగిపోయింది. వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థ గురించి విస్త్రతంగా చర్చలు కూడా జరుగుతున్నాయి.

ముందుగా 30 కోట్ల డోసులు వస్తాయని చెబుతూ ఆ 30 కోట్ల డోసులను ఎవరికి ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వాలో కూడా చర్చిస్తున్నారు. అసలు ఇంతకీ వ్యాక్సిన్ కనుగొనే విషయం ఎంత వరకూ వచ్చింది.

సత్యం న్యూస్ సేకరించిన వివరాలు ఇవి: ముందుగా అరబిందో ఫార్మా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఒకటి రెండో దశల క్లినికల్ ట్రయల్స్ ఈ ఏడాది చివరకు పూర్తి అవుతాయి. 30 కోట్ల డోసులు 2012 మార్చి నాటికి సిద్ధం కావచ్చునని అంచనా వేస్తున్నారు.

అందువల్ల 2021 సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేయవచ్చు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ రెండో దశ మానవ ప్రయోగాల స్థాయిలో ఉంది. ఏడాదికి 30 కోట్ల డోసులు తయారు చేసేందుకు ఆ కంపెనీ సిద్ధం అవుతున్నది.

ఇది 2021 సంవత్సరం ప్రధమార్ధంలోనే విడుదల కావడానికి అవకాశం ఉంది. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ పేరు కోవ్యాక్సిన్. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ సంస్థ గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో ఉంది. ప్రస్తుతం జంతువులపై ప్రయోగాలు జరుగుతున్నాయి.

బహుశ 2021 నాలుగో త్రైమాసికంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. కాడిలా కంపెనీ రూపొందిస్తున్న వ్యాక్సిన్ రెండో దశ మానవ ప్రయోగాలు సాగుతున్నాయి. ఇది కూడా 2021 మార్చి నాటికి కమర్షియల్ ప్రొడక్షన్ కు వెళ్లే అవకాశం కనిపిస్తున్నది.

వచ్చే ఏడాది మొదట్లోనే స్పూత్నిక్ వ్యాక్సిన్

స్పూత్నిక్ వి వ్యాక్సిన్ ప్రస్తుతం రెండు మూడో దశల ట్రయల్స్ నడుస్తున్నాయి. 2021 ప్రధమార్ధంలో భారత్ కు ఈ వ్యాక్సిన్ చేరవచ్చు. సమారు 10 కోట్ల డోసులను రష్యా భారత్ కు సరఫరా చేసే అవకాశం కనిపిస్తున్నది. శానోఫీ అండ్ జిఎస్ కె వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో ఉంది.

ఈ ఏడాది చివరికి ఇవి పూర్తి అవుతాయి. 2021 ద్వితీయార్ధంలో ఈ వ్యాక్సిన్ సిద్దం కావచ్చు. ఈ వ్యాక్సిన్ సిద్ధం అయితే  వచ్చే ఏడాది జూన్ తర్వాత దాదాపు 10 కోట్ల డోసులు సిద్ధం కావడానికి అవకాశం ఉంది. ఎంఆర్ఎన్ఏ 1273 మోడర్నా వ్యాక్సిన్ అమెరికాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది.

వచ్చేఏడాది జూన్ జులై నాటికి ఆస్ట్రోజెనికా వ్యాక్సిన్

ఇది కూడా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సిద్ధం కావడానికి అవకాశం కనిపిస్తున్నది. కోవిషీల్డ్ (ChAdOX1) వ్యాక్సిన్ ను ఆక్సఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రోజెనికా కంపెనీ రూపొందిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. 2021 జూన్ జులై నాటికి ఈ వ్యాక్సిన్ సిద్ధం కావడానికి అవకాశం ఉంది.

నొవావ్యాక్స్ కంపెనీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ బ్రిటన్ లో మూడో దశ ప్రయోగాల స్థాయిలో ఉంది. సీరం ఇన్ స్టిట్యూట్ తో కలిసి ఈ కంపెనీ వ్యాక్సిన్ రూపొందిస్తున్నది. రెండు బిలియన్ డోసులను కంపెనీ ఉత్పత్తి చేయబోతున్నది. ఈ వ్యాక్సిన్ భారత్ లో 2021 జూన్ నాటికి విడుదల కావడానికి అవకాశం కనిపిస్తున్నది.

బయోలాజికల్ ఇ, బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఒకటి, రెండో దశల మానవ ప్రయోగాలకు అనుమతి కోసం ఎదురు చూస్తున్నది. ఏడాదికి 80 కోట్ల నుంచి 100 కోట్ల డోసులు తయారు చేయాలని ఈ కంపెనీ యోచిస్తున్నది.

పోటీలో ముందున్న ఫైజర్ కంపెనీ

జాన్సన్ అండ్ జాన్సన్ కంపోనీ వారితో కలిసి బయోలాజికల్ ఇ కంపెనీ మరో వ్యాక్సిన్ రూపొందిస్తున్నది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు నడుస్తున్నాయి. ఇందులో 50 కోట్ల డోసులను భారత్ లోనే తయారు చేస్తారు. ఫైజర్ కంపెనీ రూపొందిస్తున కరోనా వ్యాక్సిన్ యుఎస్ఎఫ్ డి ఏ అనుమతి కోసం వేచి ఉన్నది.

ఈ నెలాఖరుకు అనుమతి వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈ ఏడాది చివరికి ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల డోసులను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తున్నది. 2021 చివరి నాటికి మరో 13వందల కోట్ల డోసులను ఫైజర్ విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. ఇలా వ్యాక్సిన్ లు వచ్చే వరకూ మనం అందరం క్షేమంగా ఉండాలి. దయచేసి అప్పటి వరకూ అందరూ మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి.

Related posts

కార్మిక గర్జన పాదయాత్రను అడ్డుకోవడం సిగ్గుచేటు

Satyam NEWS

అమ్మవారి బోనం

Satyam NEWS

స్టాచ్యూఅఫ్ రైట్స్:ముంబైలో100ఫీట్స్అంబేద్కర్ విగ్రహం

Satyam NEWS

Leave a Comment