28.2 C
Hyderabad
April 30, 2025 06: 40 AM
Slider ముఖ్యంశాలు

వీసారెడ్డి రాజీనామా తర్వాత వైసీపీ పరిస్థితి ఏమిటి?

#VijayasaiReddy

రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని ఇక పొలం పనులు చేసుకుంటానని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ప్రకటించారు. శనివారం తన పదవికి రాజీనామా చేస్తానని ఆయన అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చాలా విషయాలు చెప్పారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. జగన్ తో పాటు భారతికి కూడా ప్రత్యేకంగా ధ్యాంక్స్ చెప్పారు. ఇక ఏ పార్టీలో చేరనని తనకు ..చంద్రబాబు కుటుంబంతో వైరం లేదని.. పవన్ తో స్నేహం ఉందని చెప్పారు. ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం విజయసాయిరెడ్డి చెప్పలేదు.

కేసుల భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. కాకినాడ పోర్టు లావాదేవీల విషయంలో ఇటీవల ఈడీ పిలిచి ప్రశ్నించింది. అరబిందో శరత్ రెడ్డి ముందు పెట్టి ఆయన అనేక ఆర్థిక పరమైన అవకతవకలు చేశారని వాటిపై అనేక విచారణలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పైగా విజయసాయి రెడ్డి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణంగా టీడీపీ నేతలు ఆరోపిస్తారు. ఇలాంటి చాలా అధికారంలో ఉన్నప్పుడు చేశారు. వాటన్నింటి నుంచి తప్పించుకోవడానికి రిటైర్మెంట్ ప్రకటించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే ఆ సీటు ఖచ్చితంగా కూటమి ఖాతాలోకి పోతుంది.

అయినా ఆయన రాజీనామా చేస్తున్నారంటే.. అంతర్గతంగా ఏదో పెద్ద అలజడే జరుగుతోందన్న అభిప్రాయం రాజకీయాల్లో వినిపిస్తోంది. రాజకీయంగా సైలెంట్ గా ఉన్నా ఓకే కానీ.. సీటు కూడా వదులుకుని కూటమి ఖాతాలో పడేలా చేస్తున్నారని..అంతర్గతంగా చాలా పెద్ద రాజకీయం నడుస్తోందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారితే.. జగన్ జీవితాంతం జైజల్లో ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. జగన్ లండన్ నుంచి తిరిగి రాక ముందే విజయసాయిరెడ్డి ఇచ్చిన ఈ షాక్ వెనుక ఏముందో మెల్లగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related posts

బోనం సాక !

Satyam NEWS

Do not fear: ఎయిడ్స్ అంటువ్యాధి కాదు

Satyam NEWS

వలస కూలీలకు చార్జీల రాయితీ ఇవ్వడం లేదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!