32.7 C
Hyderabad
March 29, 2024 11: 25 AM
Slider వరంగల్

ఇంటింటా చదువుల పంట కార్యక్రమం ప్రారంభం

#MuluguEducationDepartment

విద్యార్థుల లోని టాలెంట్ గుర్తించేందుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ వినూత్నంగా ఇంటింటా చదువుల పంట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు.

డిజిటల్, ఆన్ లైన్ పాఠాలు స్టూడెంట్స్ కు ఎంతవరకు అర్థమయ్యాయో తెలుసుకునేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

“ఇంటింటా చదువుల పంట “ప్రో గ్రాంలో భాగంగా ‘వాట్సాప్ చాట్ బాట్’ పేరుతో సబ్జెక్టు ప్రాక్టీస్ చేసే చర్యలను మొదలుపెట్టారు.

దీని కోసం 85955 24405 వాట్సాప్ నంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఫస్ట్ నుంచి టెస్త్ క్లాసు వరకు స్టూడెంట్స్ వారంలో రెండు సబ్జెక్టులను ఎంచుకొని వాట్సాప్ ద్వారా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ప్రాక్టీస్ చేయవచ్చు

తెలుగు, ఇంగ్లీష్ మీడియాల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. వాట్సాప్ లో ఈ నంబర్‌కు హాయ్/హాలో/నమస్తే అని పంపించాలి. తర్వాత మొబైల్ లో అడిగిన వివరాలను ఎంపిక చేసుకోవాలి.

సబ్జెక్టుకు సంబంధించి ఒక్కో ప్రశ్నకు జవాబు చెబుతున్న కొద్దీ 10ప్రశ్నల వరకు వస్తాయి. తప్పు చెబితే కరెక్ట్ ఆన్సర్ తో వీడియోను పంపిస్తారు.

ఇలా వారానికి రెండు సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకోచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రతి స్టూడెంట్ వాడుకునేలా చూడాలని మండల విద్యాశాఖ అధికారులకు ప్రధానోపాధ్యాయులకు  డీఈవో  ఆదేశాలు జారీ చేశారు.

గత రెండు వారాలుగా పైలట్ ప్రాజెక్ట్ గా చేసి నేటి నుండి 11 వారాల పాటు 22 మార్చి వరకు ఈ కార్యక్రమం సాగుతుంది అని చెప్పారు.

ప్రతీ వారం రెండు సబ్జెక్టు ల ఫై విద్యార్థుల కు ప్రశ్నలు పంపి సమాధానం అడగటం జరుగుతుంది. తరువాత సరైన సమాధానం లు ఇస్తారు. దీని వలన విద్యార్ధి స్వీయ అభ్యాసనం కు అలవాటు అవుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన విషయాలకు సెక్టోరల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి ని అడగ వలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పారు.

Related posts

ప్రతి ఒక్కరి మేలుకోసమే జగనన్న సురక్ష కార్యక్రమం

Bhavani

రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు

Satyam NEWS

వైయస్ అసురుల రక్త చరిత్ర అని తేల్చిన సిబిఐ

Satyam NEWS

Leave a Comment