39.2 C
Hyderabad
March 29, 2024 16: 16 PM
Slider ముఖ్యంశాలు

ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో వెల్లడిస్తా

#Ponguleti

రెండు మూడు రోజుల్లోనే హైద్రాబాద్ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు తమ నిర్ణయాన్ని చేసి వెల్లడిస్తామని పొంగులేటి స్వయంగా వెల్లడించారు . ఖమ్మంలో తన ప్రధాన అనుచరులతో సమావేశం అయిన తర్వాత ఆయన

మీడియాతో మాట్లాడారు. తాను ఏ పార్టీలో చేరేది హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు. తనను నమ్ముకున్న అనుచరులు చెప్పినట్టే చేస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ కు వడ్డీతో

సహా తిరిగిచ్చే సమయం వచ్చిందని ఆయన కామెంట్ చేశారు. తాను ఓ పార్టీలో చేరుతానని ఊహించిన బీఆర్ఎస్ స్థానిక నేతలు మందు పార్టీలు, పండుగ చేసుకున్నారని అన్నారు. కానీ, మారిన తన వ్యూహంతో వారికి ఇప్పుడు నిద్ర పట్టడం

లేదన్నారు. తమది సుదీర్ఘ రాజకీయ చరిత్ర అన్నారు . వ్యక్తగత విమర్శలు చేశారు . అన్ని తమ మదిలో ఉన్నాయని వాటిని వడ్డీతో సహా చెల్లించే రోజులు ఎంతో దూరంలో లేవని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు .సీఎం కేసీఆర్,

బీఆర్ఎస్ పై తాను యుద్ధం ప్రకటించి ఐదు నెలలు అవుతోందన్నారు. తండ్రిలా భావించి పార్టీలో చేరితే కేసీఆర్ చేసిన అవమానాలు అన్ని విన్నీ కావని అయినప్పటికి అన్ని భరించి ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు . 2019 లోకసభ

ఎన్నికల్లో టికెట్ ఇవ్వక పొగ ,తర్వాత ఇస్తానన్న రాజ్యసభ కూడా ఇవ్వలేదని వాపోయారు . కనీసం కలిసి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు .రాబోయే కురుక్షేత్రంలో తనను తట్టుకోలేమని, ఎన్నికల్లో మళ్లీ ప్రజా

ప్రతినిధులు కాలేమని వారికీ భయం పట్టుకుందని అన్నారు . తండ్రిలా భావించిన కేసీఆర్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎన్నోసార్లు అవమానించినా ఓర్చుకొని, సహనంతో ఉన్నానని చెప్పారు. ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వాన్నిఒక్క పాతర కాదు రెండు పాతర్ లంతగా గొయ్యితీసి పెడతామని హెచ్చరించారు.

Related posts

ఇడుపులపాయలో విద్యార్ధి ఆకస్మిక మృతి

Bhavani

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోఅంబెడ్కర్ జయంతి

Satyam NEWS

కృష్ణానదిలో అనూహ్యంగా రెట్టింపైన వరద

Satyam NEWS

Leave a Comment