27.7 C
Hyderabad
April 25, 2024 09: 05 AM
Slider హైదరాబాద్

క‌రోనా మహమ్మారి కాలంలో నిశ్బబ్ద భాదితులు దివ్యాంగులే

Doctor Rudraraju

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 15 శాతం లేదా 1 బిలియన్ ప్రజల కన్నా ఎక్కువ మంది ఏదో ఒక రకమైన అంగవైకల్యం తో భాదపడుతున్నారని అందులోనూ 80 శాతం మంది అభివృద్ది చెందుతున్నదేశాలలో నివసిస్తున్నారని అంచనా.

మరికొన్ని నివేదికల ప్రకారం

దివ్యాంగులలో 46 శాతం 60 సంవత్సరముల పైబడిన వారే ఉన్నారు.
ప్రతి ఐదు మంది మహిళలలో ఒకరు మరియు ప్రతి పది మంది చిన్నారులలో ఒకరు అంగవైకల్యం తో జీవితంలో ఒకసారైనా భాదపడిన వారేనని అంచనా.

కనిపించని అంగవైకల్యంతో భాదపడే వారే ఎక్కువ

1 బిలియన్ కు పైగా ఉన్న దివ్యాంగులలో రమారమి 450 మిలియన్లు మానసిక అంగవైకల్యంతో భాదపడుతున్న వారేనని గణాంకాలు చెబుతున్నాయి. అందులో మూడో వంతు సంఖ్యలోని మానసిక దివ్యాంగులు సమాజంలో వివక్ష, కళంకం, నిర్లక్ష్యం కారణంగా చికిత్సకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

వివక్ష ప్రభావం

దివ్యాంగుల పట్ల సమాజం చూపించే వివక్షే వారు జన జీవన స్రవంతిలో పాల్గొనడానికి ప్రధాన అడ్డంకి. ఇలా చూపించే వివక్ష కారణంగా దివ్యాంగులైన రోగులు వారికి చికిత్స, సహాయం అందించే వారి మధ్య సంబంధాల పై కూడా ప్రభావం పడుతోంది. చారిత్రాత్మకంగా దివ్యాంగులపై వివక్ష కొనసాగడానికి మనం చూడవచ్చు. ఎన్నో సాంస్కృతికపరమైన సముదాయాలలో దివ్యాంగులను శాప గ్రస్థులుగా, అసహాయార్థులుగా, ఇతరులపై ఆధారపడే వారిగానే కాకుండా రోగులుగా చూస్తున్నారు.

అంగవైకల్యంపై చూపించే వివక్ష వలన దివ్యాంగులను సమాజంలో కొంత దూరం పెట్టడం, వారిపై పలు అపోహలు కలిగి ఉండడం, వారి పట్ల వ్యతిరేకత, వివక్షతో పాటూ సమస్యలకు వారే కారణమని నిందించడం తో పాటూ విద్వేషపూరితమైన భావనలతో కూడిన నేరాలతో పాటూ హింసకు పాల్పడడం వంటివి మనం గమనించవచ్చు. అందుకే దివ్యాంగులకు సంబంధించిన సమస్యలు, అంశాలపై సరైన సంభాషణలు సృష్టించగలిగినపుడే మనం వారికి సహాయపడిన వారవుతాం.

అవేమిటంటే

వారి చూపులో చూపు పెట్టి నేరుగా దివ్యాంగులతో మాట్లాడడం ప్రారంభించాలి.

ఇతర మనుషులతో మాట్లాడే సర్వ సాధారణ భాషనే వినియోగించాలి

చెవిటి వారు లేదా సరిగా వినలేని ఇబ్బందితో భాదపడేవారితో సంభాషించే సందర్భాలలో వారు ఎలా సంభాషించాలనుకొంటున్నారో తెలుసుకోవాలి (అనగా కొందరు వ్రాసి చూపించమని కాని లేదా టైప్ చేయమని కానీ అడుగవచ్చు కాబట్టి)

అంతే గాకుండా మీకే అంగవైకల్యం వస్తే ఎలా ఉంటుందని ఊహించుకొంటూ దివ్యాంగుల సమస్యలను ఆ దిశగా అర్థం చేసుకొనే ప్రయత్నం చేయాలనే ఉచ్చులో పడవద్దు. ఈ గోల్డెన్ రూల్ థింకింగ్ అంటే ఇదే అత్యంత శ్రేష్టమైన ఆలోచనా విధానమనే భావనను కట్టి పెట్టాలి. ఎందుకంటే దివ్యాంగుల పడే కష్టాలు, వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడాలుంటాయి. అందుకే వారు చెప్పింది విని, వారి భావనలను అర్థం చేసుకొంటూ వారికి ఎలా మంచి సహాయకారిగా మారవచ్చో ఆలోచించాలి.

సానుభూతి చూపించవద్దు

దివ్యాంగులకు సానుభూతి చూపించడం కానీ వారి పట్ల జాలి ప్రదర్శించడం చేయవద్దు. వారికి అది అవసరం లేదు. అంగవైకల్యం ఉన్నా వారు ఎంతో మనోధైర్యంతో బ్రతకడం గురించి మాట్లాడవద్దు. ఎందుకంటే దివ్యాంగులందరిలోనూ ఈ ధైర్యం ఉండదు, కొందరు యువకులలో మనోధైర్యం ఎక్కువ ఉంటే మరి కొందరిలో తక్కువ ఉండే అవకాశముంటుంది. దీంతో పాటూ వీరి పట్ల మనకు ఉండాల్సింది వారి ఇబ్బందుల పట్ల సరైన అవగాహన తప్ప జాలి కాదు, అలానే వారికి భరోసా కన్నా అవకాశాల కల్పన, సహాయం కన్నా వారిని మనతో సమానంగా గుర్తించడం ఎంతో అవసరం. మనకు ఎవరూ సహాయపడరనే భావన వారిని ఎక్కువగా భాదిస్తుంది. అలానే వారికి కలుగుతున్న కష్టాల పట్ల విచారం వ్యక్తం చేయడం అసలు దివ్యాంగులకు సహాయపడకపోగా వారిలో ఆత్మ నూన్యతా భావానికి దారి తీస్తుంది. వారిపై జాలి పడడం కన్నా వారికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొనేలా సరైన మార్గదర్శనం చేయడం ద్వారా వారిలో ఒక సానుకూల దృక్పధాన్ని ఏర్పరచుకొనేలా ప్రోత్సాహం కలిపించాలి.

అందుకే దీర్ఘకాలిక వ్యాధులు మరియు అంగవైకల్యంతో భాదపడుతున్న మన వారికి సహాయం అందించేటపుడు క్రింది విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.

పాటించాల్సినవి

వారి నొప్పి, భాదను నిజమని నమ్మండి

వారి ఆరోగ్య సమస్యలపై సరైన అవగాహన పెంచుకోవడానికి సమయం వెచ్చించండి

వారికి మీరేలా సహాయపడగలరో స్వయంగా అడిగి తెలుసుకోండి

చేయకూడనవి

అడగకపోయినా సలహాలు ఇవ్వొద్దు.

వారి భాద మీకంతా అర్థమైనట్లు భావించవద్దు.

అన్ని అంగవైకల్యాలు బయటకు కనిపించేవి కావు

అన్ని అంగవైకల్యాలు మనకు కనిపించేవి కావు అన్న నినాదంతో ఇంగ్లండులో పెద్ద అవగాహన కార్యక్రమం చేపట్టి తద్వారా దివ్యాంగులలో బయటకు వెంటనే కనిపించని పలు మానసిక సమస్యలు, దీర్ఘకాలిక నొప్పులు, అలసిపోవడం, చూపు కనిపించకపోవడం, చెవులకు వినిపించకపోవడం, నరాలకు సంబంధించిన పలు రుగ్మతలు, క్రోన్స్, కొలిటిటిస్ వంటి మానసిక వ్యాధులు వంటి వాటిపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఎవరైనా దివ్యాంగులు చెబితే మనం పలు సందర్భాలలో వెంటనే నమ్మం. అందుకే వీరి పట్ల పలు సందేహాలు, ప్రశ్నలు అడగడం వలన వారికి ఇబ్బందులు కలిగించే పనులు చట్ట విరుద్దమైనవిగా భావించి మనం ప్రవర్తించేలా చేయడమే ఈ అవగాహన కార్యక్రమ లక్ష్యం కూడా.

కోవిడ్ మహమ్మారి – నిశ్శబ్దంగా భాదపడిన సమాజం

కోవిడ్ మహమ్మారి కారణంగా విధించిన లాక్ డౌన్, తదనంతరం ఆంక్షల కారణంగా పలువురు దివ్యాంగులు ఒంటరిగా గడపాల్సి రావడంతో పాటూ ఇతరులతో సంబంధాలు తెగిపోవడం, వారి సర్వ సాధారణ రోజు వారి కార్యచరణకు ఇబ్బందులు ఏర్పడడం తో పాటూ వారికి అందాల్సిన ఇతరత్రా సేవలు నిలిచిపోవడం లేదా పూర్తిగా అందించలేని స్థితి ఏర్పడడం వలన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల సామాజిక, మానసిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపింది. అందుకే 2020 లో జరిపిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నాడు వీరి ఇబ్బందులను గమనిస్తూ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొని రావడానికి ప్రభుత్వాలు చేపడుతున్న కార్యాచరణలలో వీరిని కూడా చేర్చాలని సూచించడం జరిగింది. వీరి ఇబ్బందుల పట్ల పెద్ద ఎత్తున అవగాహన కలిపించడం ద్వారా వారిని కూడా సమాజంలో భాగంగా భావించేలా అందరికీ అవగాహన కలిగించడం జరిగింది.

మరింత ఎక్కువ అవగాహన, ఎక్కువ సదుపాయాలు అందుబాటులోనికి తేవడం, ఎక్కువగా సమాజంలో భాగస్వాములుగా మార్చడం.

మన విద్యా సంస్థలైన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో పాటూ ఉద్యోగాలలో వారికి సరైన అవకాశాలు అందుబాటులోనికి తీసుకొని రావడం ద్వారా దివ్యాంగులలో సాధారణంగా ఏర్పడే ఆర్థిక ఇబ్బందులను దూరం చేసి తద్వారా వారు స్వతంత్ర్యంగా, ఆర్థిక లోటుపాట్లు లేని జీవితం గడపడానికి వీలు కలుగుతుంది. అందుగే 2020 దివ్యాంగుల దినోత్సం ప్రత్యేకంగా కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో ఈ అంశం పైనే దృష్టి కేంద్రీకరించింది. దివ్యాంగులకు ఇలాంటి అవకాశాలు కలిపించి వారిని సమాజంలో ఇతరులతో సమాన అవకాశాలు కలిపించడమనేది వారి అభివృద్దికే కాక సమాజంలో పౌరహక్కులు, శాంతి భద్రతలకు సంబంధించిన హక్కుల విషయంలో పురోగతి సాధించనవారవుతాం. అంతే గాకుండా 2030 నాటికి అభివృద్దిలో ఎలాంటి వివక్ష చూపకూడదనే అజెండాను కూడా అమలు పరచిన వారవుతాం.

అందుకే దివ్యాంగులకు వారి హక్కులు కలిపించడం అనేది చట్టపరమైన అంశంగా కాకుండా భవిష్యత్తుపై పెట్టబడిగా భావించాల‌ని ప్ర‌ముఖ వైద్య నిపుణులు డాక్ట‌ర్ తేజా రుద్ర‌రాజు పేర్కొన్నారు.

Related posts

కంధమాల్ జిల్లా ఎన్ కౌంటర్ లో నలుగురి మృతి

Satyam NEWS

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, తెప్పోత్సవం కు హాజరుకండి

Murali Krishna

వలస కార్మికులకు ఆదుకున్న అటవీ శాఖ

Satyam NEWS

Leave a Comment