ఏలూరు జిల్లా పెదవేగి మండలం లో పంచాయతీ ఎన్నికలకు ముందు సాగిన స్పెషల్ అధికారుల పాలనలో పంచాయతీలను ఆర్దికంగా గా నిర్వీర్యం చేసి కోట్ల రూపాయల స్వాహా చేసిన పంచాయతీ ఉద్యోగుల పై నేటికీ అధికారులు చర్యలు చేపట్టక పోవడం తో పేద వేగి మండలం లో ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యం గా రాట్నాల కుంట గ్రామ పంచాయతీ లో ఒక స్పెషల్ ఆఫీసర్ విధులలో ఉండగానే మరో అధికారి నకిలీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డర్ సృష్టించుకుని నకిలీ వేలిముద్ర వేసి ఏకంగా 8 లక్షల రూపాయల పంచాయతీ నిధులు స్వాహా చేసి అడ్డం గా దొరికి పోయినా జిల్లా అధికారి లు పట్టించుకోలేదు. ఆ నిధుల స్వాహా పై అప్పట్లో కొంతమంది విచారణ అధికారులు నాలుగు గోడల మధ్య విచారణలు జరిపి నేటికీ ఏ విధ మైన చర్యలు చేపట్ట లేదని పెదవేగి మండల ప్రజలు చెప్పుకుంటున్నారు.
అంతే కాదు అప్పట్లో 9 గ్రామ పంచాయతీలలో భారీగా నిధులు స్వాహా అయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తినా ఆ పంచాయతీలలో నేటికీ విచారణ జరిపిన దాఖలాలు కూడా లేవని చెప్పుకుంటున్నారు. అదే దళిత వర్గాలకు చెందిన ఉద్యోగులు వేలల్లో అక్రమాలకు పాల్పడితే ఆజ్ఞ మేఘాల మీద విచారణలు జరిపి వెంటనే చర్యలు చేపట్టే వారని అదే కొంత మంది పంచాయతీ ఉద్యోగుల నకిలీ బిల్లులతో లక్షల్లో కోట్ల లో పంచాయతీ నిధులు స్వాహా చేసినా వాళ్ళ పై ఇంత వరకు చర్యలు చేపట్టక పోవడం వెనుక ఆంతర్యం పేద వేగి మండల ప్రజలకు అర్థం కాని ప్రశ్న గా మిగిలిందని చెప్పుకుంటున్నారు.
నిధులున్న పంచాయతీలను టార్గెట్ చేసుకుని ఆ పంచాయతీ నిధులు లక్షల్లో మింగేసిన వారు అధికారుల,రాజకీయ నాయకుల అండ దండల ను అడ్డు పెట్టు కొని నేటికీ విచారణ జరగనీయకుండా అడ్డు పడుతూ విచారణ చేయించే అధికారుల దృష్టి లో అవినీతి రహిత ఉద్యోగులుగా చెలామణి ఔతున్నారంటే వాళ్ళ వెనుక రాజకీయ అండ దండలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక పంచాయతీ ఉద్యోగి ఏలూరు మండలం లో ఒక పంచాయతీ లో ఉద్యోగం చేస్తున్న సమయం లో ఆ ఉద్యోగి లక్షలాది రూపాయల పంచాయతీ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారం పై ఏలూరు మండల పరిషత్ అప్పటి అధికారొకరు స్పందించడం తో అప్పటి రాష్ట్రప్రభుత్వ ముఖ్య సలహాదారుడు, ఆయన బంధువు ఇద్దరూ కలిసి వేరు వేరు పర్యాయాలు ఆ అధికారికి ఫోన్ చేసి ఏలూరు లో ఒక పంచాయతీ లో జరిగిన నిధుల దుర్వినియోగం పై కలగచేసుకోవద్దని ఆ అధికారిని హెచ్చరించినట్టు సమాచారం. వివిధ పంచాయతీలలో ఆ ఉద్యోగి విధులు నిర్వహించిన పంచాయతీల లో పాల్పడిన నిధుల దుర్వినియోగం పైన వార్తలు రాసిన జర్నలిస్ట్ ను తన వెనుక ఉన్న ఒక పోలీస్ సిబ్బంది తో ను ఆ ఉద్యోగి కి మద్దతు గా ఉన్నా కొంత మంది పంచాయతీ ఉద్యోగుల తో ను కలిసి తనకు వ్యతిరేకం గా వార్తలు రాసే జర్నలిస్ట్ ను హత మార్చ దానికి స్కెచ్ గీసి విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల రౌడీలతో సుపారి మాట్లాడినట్టు అప్పట్లో కల కలం రేగింది.
రాజకీయాలనే శాసిస్తూ 9 పంచాయతీలలో జరిగిన కోట్లాది రూపాయల అవి నీతి విచారణ ను భూ స్థాపితం చేసి,విచారణ తన పై జరగాల్సిన విచారణ కు అతి గతీ లేకుండా నేటికీ జిల్లా అధికారులను తన గుప్పెట్లో ఉంచుకుని దర్జాగా ఉద్యోగం చేసే పంచాయతీ ఉద్యోగుల పై
కూడా జిల్లా ఉన్నతాదికారులు విచారణ చేసి అవినీతి నిగ్గు నిర్భాంగా తేల్చాలని ప్రజలు కోరుతున్నారు. జాలిపూడి పంచాయతీ లో సర్పంచ్ తో బాటు నిధులు స్వాహా చేశారని తెలిన ఇరువురు ఉద్యోగుల పైన కూడా అధికారులు త్వరలో చర్యలు చేపడతారని జాలి పూడి పంచాయతీ లో గుస గుసలు వినబడుతున్నాయి.