39.2 C
Hyderabad
April 23, 2024 16: 36 PM
Slider ప్రపంచం

సిరెంజిల కొరత ముప్పు ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

వచ్చే ఏడాది నాటికి, ప్రపంచంలో దాదాపు 200 మిలియన్ ఇంజెక్షన్ సిరంజిల కొరత ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా టీకా తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని వేగవంతం చేశారు.

అయితే, ఇప్పటివరకూ అందుతున్న నివేదికల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నదాని ప్రకారం మరో నెలరోజుల టీకా ఉత్పత్తికి అవసరమైన సిరెంజిలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిరెంజి తయారీ కంపెనీలు తక్కువగా ఉండటం.. వ్యాక్సిన్ కోసం నాణ్యమైన సిరెంజి వాడకానికి సిద్ధం చేయడం ఆలస్యం అవుతోంది.

దీంతో.. వచ్చే సంవత్సరంలో వ్యాక్సిన్ కోసమే కాకుండా సాధారణ ఉపయోగం కోసం కూడా సిరెంజిల కొరత ఎదురయ్యే అవకాశం ఉందని డబ్ల్యు హేచ్వో అంచనా వేస్తోంది.

Related posts

వనమూలికా మహోత్సవంగా ఆచార్య బాలకృష్ణ జన్మదినం

Bhavani

జై తెలంగాణ:తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి

Satyam NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వేముల

Satyam NEWS

Leave a Comment