28.7 C
Hyderabad
April 25, 2024 03: 36 AM
Slider ప్రపంచం

భారత్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ కృతజ్ఞతలు

భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాక్సిన్ కొరతతో ఇబ్బంది పడుతున్న దేశాలకు టీకాలు అందించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది చివరికల్లా అన్ని దేశాలు 40 శాతం వ్యాక్సినేషన్‌ను సాధించాలన్న లక్ష్య సాధనకు భారత్ నిర్ణయం మద్ధతు పలుకుతోందని ట్వీట్ చేశారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో పేద‌, మ‌ధ్య ఆదాయ దేశాల‌కు క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కోవాక్స్. దీనికి ఇండియాలో త‌యారైన క‌రోనా వ్యాక్సిన్లను భారత్ అందించాల్సి ఉంది. దీనికి భారత్ ఆమోదం తెలపడంతో, డబ్ల్యూహెచ్ఓ ఛీఫ్ ధన్యవాదాలు తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో కేంద్రం వ్యాక్సీన్ ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే, ఇండియాలో వ్యాక్సినేష‌న్ స్పీడ‌ప్ కావ‌టంతో పాటు కంపెనీల వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాయి. అక్టోబ‌ర్ నెల‌లో ఒక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్లే 22కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కోవాక్స్ ఒప్పందం ప్రకారం వ్యాక్సీన్లను సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది.

Related posts

మాజీ సర్పంచ్ అదృశ్యం: తన చావుకు నలుగురు కారణమని సెల్ఫీ వీడియో

Satyam NEWS

ప్రభుత్వ పథకానికి వినూత్న ప్రచారం

Satyam NEWS

అధిక వర్షాల వలన నష్టపోయిన  రైతులను ఆదుకోవాలి

Murali Krishna

Leave a Comment