37.2 C
Hyderabad
March 28, 2024 17: 31 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

భరత్ తో అసత్యాలు చెప్పిస్తున్నదెవరు?

web-bharat-758x474

హిందూపూర్ శాసనసభ్యుడు, సినీనటుడు, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ తెలియని వారు ఎవరూ ఉండరు. బాలకృష్ణ వియ్యంకుడికి కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వద్ద సుమారు 500 ఎకరాలు ఉంది. ఈ విషయంలో ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఇన్ సైడ్ ట్రేడింగో లేక క్విడ్ ప్రో కోనో పేరు ఏదైతేనేం రాజధాని దాని పరిసరాలు లేదా విమానాశ్రయం లేదా అతి పెద్ద టెక్నాలజీ పార్కులు వచ్చే ప్రదేశాలలో ఈ ప్రముఖులు పెద్ద ఎత్తున భూములు కొన్నారా లేదా అనేది తాజా వివాదాస్పద అంశం.

భూములు కొన్న వారు లేదా ప్రభుత్వం నుంచి అప్పనంగా కొట్టేసిన వారు ఇప్పుడు సుద్ద పూసల్లా మాట్లాడటమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తున్నది. బాలకృష్ణ రెండో అల్లుడు భరత్ విషయానికి వస్తే ఆయన చెబుతున్న సుద్దులు చూస్తుంటే అమ్మా ఎంతకైనా వీరు మాట్లాడగలరు అనిపిస్తుంది. ఇప్పుడు వివాదం అయిన భూములు ఆయన కంపెనీకి చంద్రబాబు నాయుడు హయాంలో కేటాయించినివే. ఈ విషయంలో ఇంతవరకూ ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నప్పటికీ ప్రభుత్వం జారీచేసిన జి.ఓ ను పరిశీలిస్తే అది నిజమని నిర్ధారణ అవుతోంది.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చారా, తెలుగుదేశం హయాంలో ఇచ్చారా అనేది పక్కన పెడితే అసలు ప్రభుత్వ భూములు కేటాయించడానికి ఈ సంస్థకు గల అర్హతలను, కంపెనీ స్థాపనకు గల మౌలిక సదుపాయాలను పరిశీలించకుండా గుడ్డిగా కేటాయించారనేది మాత్రం వాస్తం. కర్మాగారం నెలకొల్పడానికి ఈ సంస్థ కు సామర్ధ్యం ఉందా, సంస్థ ప్రతిపాదించిన ఉత్పత్తి కి అవసరమైన ముడిసరుకు అందుబాటలో ఉందా, ఆర్ధిక సామర్ధ్యం తదితర అంశాలను పరిశీలించకుండా వందల ఎకరాల భూమిని ఏవిధంగా కేటాయిస్తారన్నదే అసలు విషయం.

వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అన్న సంస్థ కు చెందిన చరిత్రను పరిశీలిస్తే ఈ భూములు కేటాయింపు వెనుక బంధు ప్రీతి, రాజకీయ ఒత్తిడి స్పష్టంగా ఉందనేది నూటికి నూరు శాతం నిజం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న ఎం.ఎస్.రామారావు ఈ కంపెనీకి భూములు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసే సమయానికి కోనసీమ గ్యాస్ పవర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ నిల్వలు లేకుండా నాలుగు గ్యాస్ విద్యుత్ ప్రాజెక్టులకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం, గ్యాస్ లేని కారణంగా కోనసీమ ప్రోజక్ట్ మూత  పడటం జరిగిపోయాయి.

ఇదే కంపెనీ మాతృసంస్థ అయిన విబిసిఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ గ్యాస్ ఆధారంతో ఎరువులు కర్మాగారం పెడతామంటే ప్రభుత్వం ఏవిధం గా భూములు కేటాయించిందో అంతుచిక్కని విషయం. ఇదే వ్యక్తి పేరు మీద నడిచే కోనసీమ గ్యాస్ పవర్ కంపెనీ ఆర్ధిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించక పోవటంతో జాతీయ కంపెనీ లా బోర్డు ముందు కేసు నడుస్తున్న విషయం విదితమే. అయితే గీతం విద్యా సంస్థల అధిపతి, సినీనటుడు బాలకృష్ణ చిన్న అల్లుడు, తెలుగుదేశం యువనేత లోకేష్ తోడల్లుడు, ఎంఎస్.రామారావు కుమారుడు భరత్ చెప్పిన దాని ప్రకారం 2013 వ సంవత్సరంలో ఈ భూములను ప్రభుత్వం ఈ కంపెనీకి కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థకు (apiic)  కేటాయిచినట్లు అప్పటి ప్రభుత్వం జారీచేసిన జిఓ ఎంఎస్ నెంబర్ 523,547లో స్పష్టంగా పేర్కొంది.

ఈ రెండు జిఓ లకు మార్పులు చేస్తూ రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జిఓ ఎంఎస్ నెంబర్.-269 ద్వారా ఈ భూములను వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కు కేటాయిస్తూ 15.7.2015న జిఓ జారీ చేశారు. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భూమి కోసం ఈ కంపెనీ దరకాస్తు చేసి దాని పొందటానికి తీవ్రంగానే ప్రయత్నం చేసింది. అప్పటి కేంద్ర మంత్రి, రామారావు మామగారు, భరత్ తాత  అయిన కావూరి సాంబశివరావు పలుకుబడి ద్వారా ప్రభుత్వం తీవ్ర స్థాయిలోనే ఒత్తిడి తెచ్చేరు.

అప్పటికే ఈ భూములు కొండలరావు అనే వ్యక్తికి కేటాయించడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పటి కేటాయింపులను రద్దు చేసి ఆ భూములను ఏపీఐఐసీ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే కొండలరావు అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పరిచయస్తుడు అయినందునే  ఆ భూములను రద్దు చేశారనే వార్తలు వచ్చాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలతో ఉన్న బంధుత్వాలను అడ్డు పెట్టుకొని ఈ భూములను పొందవచ్చున్నది అసలు కద.

కొండలరావు ఉన్నత న్యాయస్థానం ను ఆశ్రయించటం తో ఈ భూముల వ్యవహారం కోర్టు పరిధిలోని వెళ్ళింది. కోర్టులో కేసు నడుస్తుండగానే ఈ భూములను విబిసి కంపెనీకి కేటాయించడం, ఆ భూములను సీఆర్డీఏ పరిధిలోనికి తేవటం రాజకీయ పలుకుబడి కాదనడం, దానికి శుక్రవారం మరో మాజీ మంత్రి వంత పాడటం మరో విడ్డూరం.

ఈ భూములు కేటాయించే నాటికి భరత్ ఇంకా రాజకీయాలలో ప్రవేశించలేదు. దీనిపై  ఆయనకు పూర్తి అవగాహనలేదు ఈ ఫైల్ కథను అప్పట్లో దగ్గరవుంది నడిపించిన లోకేష్ ఎందుకు స్పందించలేదు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. లోకేష్ తెరపైకి రాకుండా భరత్ తో చెప్పిస్తుండం చూస్తుంటే ఇందులో ఏదో తిరకాసు ఉందనేది అర్ధం అవుతున్నది. ఈ తిరకాసు ఇప్పుడు సత్యం న్యూస్ చెబుతున్నదే.   

ramakrishna-mutnuru-1
ముట్నూరు రామకృష్ణ

( భూముల అసలు కధ  వేరు – రేపు- సత్యం న్యూస్ మరి కొన్ని వివరాలు అందిస్తుంది)

Related posts

OBC రిజర్వేషన్ల పై శ్రద్ధ చూపిన సోనియాకు కృతజ్ఞతలు

Satyam NEWS

ఫణికుమార్ అద్దేపల్లి ట్రావెలింగ్ సోల్జర్ మోషన్ పోస్టర్ రిలీజ్

Satyam NEWS

వచ్చే ఏడాది కల్లా పెద్ద సినిమా నిర్మాణ సంస్థలన్నీ దివాలా

Satyam NEWS

Leave a Comment