సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశ రాజకీయలను తానూ తప్ప ఎవరూ శాసించలేరనే నమ్మకాన్ని దేశ ప్రజలకు కలుగచేయడానికి విశ్వ ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం జాతీయ రాజకీయాలు గురించి ఒక్క మాట మాట్లాడం లేదు. కేంద్రంలో భారతీయజనతాపార్టీ ని నిలువరించి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని, దానిలో తన పాత్ర కీలకం గా ఉండాలని చంద్రబాబు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు.అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత దేశ రాజకీయాలు ఊహించని విధంగా మారిపోయాయి. దాంతో చంద్రబాబు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడక పోగా కనీసం తన మిత్రులతో ఫోన్ లో మాట్లాడిన సందర్భాలు కూడా కన్పించలేదు. రహస్యం గా మాట్లాడారా లేదా అన్న అంశాన్ని పక్కనపెడితే మాట్లాడి ఉంటే మాత్రం జాతీయ మీడియా నుంచి గ్రామంలో ఉన్న మీడియా వరకూ అది మారు మోగిపోయేది. చివరికి తన ఒకప్పటి మితృడు, కష్టాలు నుంచి గట్టుఎక్కడానికి చీకట్లో రహస్యంగా ఢిల్లీలో కలిసిన మాజీ హోమ్ మంత్రి చిదంబరం సమస్యల సూడి గుండంలో చిక్కుకున్న కనీసం చంద్రబాబు నోటి వెంట కేంద్ర నిర్ణయాన్ని తప్పు పట్టకపోవడం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చిదంబరం విషయంలో తన మిత్రులు మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి, కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా, రాహుల్, కపిల్ సిబల్ వంటి నేతలు తీవ్రంగా ఖండించినా చంద్రబాబు కనీసం సంఘీభావం ప్రకటించక పోవటం కొత్త చర్చకు దారితీసింది.సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ నతాపార్టీ పై ఒంటికాలితో లేచిన చంద్రబాబు ప్రస్తుతం ఏ విషయంలోనూ నోరు మెదపక పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో మొదటి దశలో ఎన్నికలు పూర్తి అయినవెంటనే చంద్రబాబు దేశం మొత్తం పర్యటించి మోడీ కి వ్యతిరేకంగా విస్తృతం గా ప్రచారం చేశారు. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దేశంలో వ్యస్థలను మోడీ నాశనం చేస్తున్నారని, భారతీయజనతాపార్టీకి వ్యతిరేకంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతో ఉంది అని అనేక బహిరంగ సభలలో నొక్కి వక్కాణించారు. లక్నో లో మాయావతి ని కలిసైనా రోజే ఢిల్లీలో రాహుల్,సోనియాలతో సమావేశం అయ్యేవారు..వెంటనే కలకత్తా వెళ్లి మమతా ను కలిసే అటునించి ఢిల్లీ వచ్చి కేజ్రీవాల్ ను కలిసేవారు. ఎక్కడికి వెళ్లిన మోడీ,కేసీర్,జగన్ లు కలిసి మోసం చేస్తున్నారని ప్రచారం చేసేవారు..తన రాష్ట్రంలోని ఎన్నికల ప్రచారంలో తాను చేసిన అభివృద్ధిగురించి చెప్పే దానికంటే మోడీ కేసీర్,జగన్ గురించే ఎక్కువగా ప్రచారం చేసేవారు.అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మోడీ గురించి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక మర్మం పరిశీలకులకు అంతు చిక్కటం లేదు. తన నమ్మిన బంటులు సుజనా చౌదరి, సీఎంరమేష్, గరికిపాటి మోహనరావు, టిజి వెంకటేశులు రాజ్యసభ లో తెలుగుదేశంపార్టీని విలీనం చేశారు. ఇందులో సుజనాచౌదరిమంత్రిగా చేయగా మిగిలిన ఇద్దరు బాబుకి కుడి, ఎడమల గా ఉండేవారు. అయితే ఊహించని విధంగా ఈ నలుగురు అధికార పార్టీ గూటికి చేరినా చంద్రబాబు తనదైన శైలిలో ఎక్కడా స్పందించలేదని ,చంద్రబాబు అనుమతితోనే వీరు పార్టీఫిరాయించారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ సంఘటను పక్కను పెడితే కేంద్రంలో బీజేపీకి దూరం జరిగిన తరువాత సిద్ధాంత పరంగా బద్ధ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ పార్టీ తో జత కలిపిన చంద్రబాబు ఎన్నికలు ముగిసేవరకూ ఆ పార్టీతో చాలా సన్నిహితం గా మెలిగేరు..అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేరు.ఆ సమయంలోను చిదంబరం వంటి నేతలతో చాలా సంఖ్యత ప్రదర్శించారు ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రతిపక్షాలు అన్ని చిదచిదంబరంకు బాసటగా నిలిచినా బాబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం ఆశ్చర్యమే.