28.7 C
Hyderabad
April 25, 2024 06: 21 AM
Slider సంపాదకీయం

సినీ పరిశ్రమ పెద్దన్న చిరంజీవి నోరెందుకు విప్పడం లేదు?

#megastarchiranjeevi

తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్నగా మారి అయినదానికి  కానిదానికి ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆకాశానికి ఎత్తేస్తున్న మెగాస్టార్ చిరంజీవి వకీల్ సాబ్ సినిమాకు జరుగుతున్న అన్యాయం పై ఎందుకు మాట్లాడటం లేదు?

ఈ ప్రశ్న తెలుగు సినిమా అభిమానులు అందరూ అడుగుతున్నారు. వకీల్ సాబ్ సినిమాను జగన్ ప్రభుత్వం కావాలని అడ్డుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. బెనిఫిట్ షో లను అడ్డుకోవడం నుంచి డైనమిక్ ప్రయిసింగ్ వ్యవస్థ ను కూడా ఏపి ప్రభుత్వం అడ్డుకున్నది.

సినిమాకు డిమాండ్ ను బట్టి టిక్కెట్ ధరలు వసూలు చేసుకునే విధానం దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్నది. డిమాండ్ లేకపోతే సినిమా టిక్కెట్ ఎంత పెట్టుకున్నా ఎవడూ కొనడు. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునే వ్యవస్థపై కూడా కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి.

సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న వకీల్ సాబ్ చిత్రంపై డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా కాలంలో పూర్తి నష్టాల్లోకి వెళ్లిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమకు వకీల్ సాబ్ ఒక వరంలా వచ్చింది.

ఈ చిత్రం లాభాలు ఆర్జిస్తే తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకుని ఉండేది. ఈ చిత్రం వసూలు చేసే డబ్బులన్నీ పవన్ కల్యాణ్ కో ఆ చిత్ర నిర్మాతలకూ వెళ్లిపోవు. డిస్ట్రిబ్యూటర్లకు వెళతాయి. కొన్ని వేల మంది ఈ చిత్రంతో లాభపడేవారు.

వకీల్ సాబ్ చిత్రం దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేసే స్టామినా ఉన్న చిత్రంగా పేరు పొందింది. అయితే పైరసీదారులు సినిమాను బయటకు వదిలే లోపునే ఈ కలెక్షన్లను వసూలు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంత భారీ మొత్తంలో కలెక్షన్లు వస్తే తెలుగు సినీ పరిశ్రమ కరోనా దెబ్బ నుంచి కొంత మేరకు కోలుకుని ఉండేది. సినీ పరిశ్రమలోని చాలా మంది ఈ కలెక్షన్లలో వాటా అందుకుని ఉండేవారు. అలాంటి అవకాశంపై రాజకీయ కారణాలతో వై ఎస్ జగన్ దెబ్బ కొట్టారు.

దీన్ని చిరంజీవి ఎందుకు ప్రశ్నించడం లేదు? తమ్ముడి సినిమాను కుటుంబ సమేతంగా చూసిన చిరంజీవి ఏపీలో ఆ చిత్రానికి జరుగుతున్న నష్టాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడి చిత్రానికి నష్టం రాకుండా ఎందుకు చేయలేకపోతున్నారు?

జగన్ ను పొగడటానికి తప్ప తెలుగు సినిమాకు మేలు చేయడానికి చిరంజీవి ప్రయత్నం చేయరా? అంటూ తెలుగు సినిమా అభిమానులు చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెట్టి చూసినా వకీల్ సాబ్ కలెక్షన్లు వసూలు చేస్తే వేలాది మంది సినీ పరిశ్రమలోని వారు బాగుపడేవారు.

ఆ అవకాశాన్ని రాజకీయాల కారణంతో ఏపి ప్రభుత్వం కాలరాస్తుంటే చిరంజీవి మాట్లాడరా?

Related posts

ఆపన్న హస్తం అందించిన జనచైతన్య ట్రస్ట్

Satyam NEWS

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 54 వ వర్ధంతి

Satyam NEWS

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

Murali Krishna

Leave a Comment