గత నిజం పాలనలో దొరల పెత్తనాన్ని, బానిస బ్రతుకులను ఎదిరించి, పోరాడింది కమ్యూనిస్ట్ కామ్రేడ్లు అని చెప్పుకుంటుంటారు. బడుగు బలహీన, అణచబడిన వర్గాలకు అండగా ఉన్నది కమ్యూనిస్టు పార్టీకి పేరు ఉన్నది. కానీ ఇప్పుడు ఆ పార్టీ రోజురోజుకు సిద్ధాంతాలను మరిచిపోతున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటికి కమ్యూనిస్టు పార్టీ సొంతంగా ఎక్కడా పోటీ చేసినా తన ఓటు బ్యాంకు ఎక్కడ పోదు. గెలవక పోయినా ప్రజలు మద్దతు తెలుపుతారు. ఎక్కడైనా ఇదే ఫలితం ఉంటుంది. ప్రజలకు కమ్యూనిస్టు పార్టీ అంటే ఒక నమ్మకం ఉన్నది. అలాంటి కమ్యూనిస్టు పార్టీ ఈరోజు దొరలు స్థాపించిన గులాబి పార్టీకి మద్దతు పలుకుతున్నారని మాటలు వినిపిస్తున్నాయి. అంటే దొరలకు కమ్యూనిస్టు పార్టీ వారు మద్దతు ఇస్తున్నారాఅని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్టని ప్రజలు కామ్రేడ్లను ప్రశ్నిస్తున్నారు. ప్రజల సమస్యలపై ఎర్రజెండా చేతిలో పట్టుకొని పోరాడే కామ్రేడ్లు ఈనాడు దొరల పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన జరుగుతుందని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు లు కూడా చెబుతూ వచ్చారు. గత శాసనసభ ఎన్నికలలో ఇదే కామ్రేడ్లు కేసీఆర్ దొరను ఓడించి ప్రజలకు విముక్తి కలిగించాలని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీతో కమ్యూనిస్టులు జత కడుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంపై ఈ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కామ్రేడ్లు తమ సిద్ధాంతాలను మరిచి వ్యవహరిస్తున్నారానే మాటలు వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టు ఒక్క హుజూర్ నగర్ ఉపఎన్నికలతో టిఆర్ఎస్ పార్టీతో జతకట్టి కామ్రేడ్ల విలువలను తగ్గించుకోవడం మంచిదికాదని, కొందరి సొంత ప్రయోజనాల కోసం దోస్తీకి మద్దతు తెలుపడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు
previous post