36.2 C
Hyderabad
April 16, 2024 20: 56 PM
Slider చిత్తూరు

అందరూ పొగుడుతుంటే ఈ ఏడుపెందుకు?

#RKRoja

ప్రధాని మోదీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగన్ పరిపాలనను ప్రశంసిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ లను ఓడించి, హైదరాబాద్ తరిమేసినా.. మళ్లీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు టూరిస్టుల్లా వస్తున్నారు ‘ఇదేం ఖర్మరా.. బాబూ’ అని ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటున్నారు. తన పాలనను చూసి ఓటెయ్యండని చెప్పే దమ్ము, ధైర్యం లేని చంద్రబాబు, తన భార్యను అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డ్రామాలు ఆడి, మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చినా సింపతీ రాలేదు అని మంత్రి రోజా విమర్శించారు. 1995లో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 30 ఏళ్ల తర్వాత మళ్లీ చివరి ఛాన్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అని అంటుంటే.. రాష్ట్ర ప్రజలు ఇదేమి ఖర్మరా బాబు.. అని అంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. 44 ఏళ్ళ తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు, రైతులకు చేసిన న్యాయం గానీ, మంచిగానీ ఒక్కటి కూడా గుర్తుకు వచ్చే పరిస్థితి లేదంటే… దాని అర్థం ఏమిటి.. ఇదేం ఖర్మరా బాబు అనే కదా..? బాబు పేరు చెబితే గుర్తొచ్చేవి వెన్నుపోటు, దగా, మోసం, వంచనలే..అని ఆమె అన్నారు. సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరుకుగానీ, సొంత ప్రాంతం రాయలసీమకుగానీ, ఏనాడూ మేలు చేయలేదని అక్కడి ప్రజలు 2014లో కూడా తిరస్కరించిన మాట నిజమే కదా..

కాబట్టి, రాయలసీమ అంతా ఇదేం ఖర్మరా బాబు అని అనుకుంటున్నారని మంత్రి రోజా అన్నారు. బాబు వస్తే కరువు వస్తుందన్నది… ఆయన ప్రభుత్వం 2014-19 మధ్య ప్రకటించిన కరువు మండలాలను చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి, సగం మండలాలు కరువు ఉండే పరిపాలన చూసి, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు.. తాగునీరు, సాగునీరు దొరక్కపోవడం.. పశువులు చనిపోవడం.. మనుషులు వలసపోవడం చూసి.. ఇదేం ఖర్మరా బాబు అనుకుంటున్నారని మంత్రి తెలిపారు. ఇక సామాజిక వర్గాలపరంగా చూస్తే.. ఇచ్ఛాపురం నుంచి కుప్పం వరకు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు.. బీసీలను మోసం చేశాడు. ఎస్సీలనూ మోసం చేశాడు. ఎస్టీలను దగా చేశాడు. మైనార్టీలకు భవిష్యత్తే ఉండకూడదనుకున్నాడు. మరి ఇలాంటి బాబుని సామాజికవర్గాలన్నీ ఇదేం ఖర్మరా బాబు.. అనుకున్నాయే తప్ప, అది గొప్ప పరిపాలన అని ఎవరన్నా అనుకున్నారా..? అని మంత్రి ప్రశ్నించారు. రైతుల వడ్డీ భారం రెట్టింపు చేసిన ఘనత చంద్రబాబుదే కదా.. ఉచిత విద్యుత్ ఇస్తే, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న ఫిలాసఫీ చంద్రబాబుదే కదా..

మరి ఇలాంటి బాబు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే… ఇదేం ఖర్మరా బాబు అనే కదా..? విద్యార్థులు ఏమనుకుంటున్నారంటే.. అరకొర ఫీజు రీయింబర్స్ మెంటు, అదికూడా బకాయిలు పెట్టి, ఎగ్గొట్టి, ఆ పథకాన్నే నిర్వీర్యం చేసిన చంద్రబాబును చూసి.. ఇదేం ఖర్మరా బాబు.. అనుకున్నారే తప్ప, ఏరోజు అయినా, విజనరీగా భావించారా..? అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జగనన్న.. ఒక కొడుకులా తోడున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలను దూరం చేసేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 98శాతం మూడున్నరేళ్ళలోనే నెరవేర్చారు. సంక్షేమం, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ… రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారు. ఇటువంటి మనసున్న నాయకుడి జన్మదినం సందర్భంగా… సంబరాలు చేస్తే ప్రతిపక్షాలకు ఎందుకు కడుపు మంట..?. ఏమీ చేయలేనివాళ్లు చేస్తున్నవాళ్లను చూసి ఏడుస్తుంటారు అని మంత్రి వ్యాఖ్యానించారు.

Related posts

నల్లమల రేంజ్ పరిధిలో అక్రమ కలప స్వాధీనం

Satyam NEWS

క్షీణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం..

Sub Editor

50 బైక్ అంబులెన్సు సర్వీసుల ప్రారంభం

Satyam NEWS

Leave a Comment