33.2 C
Hyderabad
April 26, 2024 00: 31 AM
Slider వరంగల్

ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యవైఖరిపై 14 తేదీన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల బిక్షపతి తెలిపారు.

ములుగులోని రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు.

గతంలో వై టి సి భవనంలో తరగతులు ప్రారంభిస్తామని కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాగ్దానం చేశారని ఆయన తెలిపారు.

ఆ మాట పేపర్ల వరకే పరిమితం అయిందని ఆయన అన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం స్థల సేకరణ కూడా చేశారని అయితే ఇంత చేసినా యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు.

అదే విధంగా ములుగులో బస్ డిపో ఏర్పాటు చేయాలని, ఆర్టిఏ ఆఫీస్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క పేరు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

కే.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్

Related posts

శ్రీలంక సంక్షోభం: ఆదుకుంటున్న భారత్ వాడుకుంటున్న చైనా

Satyam NEWS

న్యాయ వ్యవస్థ పై ఏపి ప్రభుత్వ తీరు ఆందోళనకరం

Satyam NEWS

వచ్చేనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు

Satyam NEWS

Leave a Comment