35.2 C
Hyderabad
April 20, 2024 15: 41 PM
Slider ప్రత్యేకం

ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు?

#marriage

నేటి నుంచి ఆషాఢ మాసం వచ్చింది. గ్రామ దేవతలకు ఈ మాసం పవిత్రమైనది. శాస్త్రం ప్రకారం చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం నందు ఉండటం వల్ల ఈ మాసాన్ని ఆషాఢం అంటారు.

జులై 10 – ఆగస్టు 8 వరకు ఈ మాసం ఉంటుంది. ఈ మాసం మొత్తం వర్షాలు ఎక్కువ కురుస్తుంటాయి. అందువల్ల పూర్వం ప్రజలు అందరూ పొలం పనులు అధికంగా చేసుకుంటారు.

వర్షాలు ఎక్కువగా కురుస్తుండటం వల్ల వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది గుమికూడకుండా ఉండేలా కార్యక్రమాలు నిర్వహించరు.

అంటువ్యాధులను నిర్మూలించడానికి గ్రామదేవతలకు పూజలు ఎక్కువగా చేస్తుంటారు.  

దీక్ష సంబంధిత శూన్యమాసం కావడంతో ఆషాఢం గర్భదారణకు అనువైంది కాదని పురాణాలు పేర్కొంటున్నాయి.

అందుకే ఈ మాసంలో పెళ్లిళ్లు చేయరు. అంతేకాక కొత్తగా పెళైన వారినీ దూరంగా ఉంచుతారు. శాస్త్రీయంగానూ వర్షకాలంలో గర్భిణీలకు వ్యాధులు ప్రబలే అవకాశముంది.

ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి శాస్త్ర ప్రకారం ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు చేయడాన్ని శుభంగా పరిగణించరు.

Related posts

రోడ్ల విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలి

Satyam NEWS

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

కొల్లాపూర్ ప్రచార సరళిపై కేటీఆర్ అసంతృప్తి

Satyam NEWS

Leave a Comment