39.2 C
Hyderabad
April 25, 2024 15: 10 PM
Slider సంపాదకీయం

టెన్త్ పరీక్షలపై ఇంత మంకుపట్టు ఎందుకు?

#Y S Jagan

టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమి ఆలోచిస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పడం వెనుక లాజిక్ ఎవరికి అర్ధం కావడం లేదు.

ప్రాణం ఉంటే కదా పరీక్షలు అని ప్రశ్నించేవారికి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పడం లేదు. దేశంలో దాదాపు 20 రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేస్తే ఏపిలో మాత్రం కచ్చితంగా జరిపి తీరుతాం అంటూ పదే పదే ప్రకటించడం ఏమిటి? ఏమిటో అర్ధం కాదు.

మే రెండో వారం నుంచి కరోనా తీవ్రాతి తీవ్ర రూపం దాలుస్తుందని ఒక వైపు వైద్య నిపుణులు చెబుతుంటే పరీక్షలు పట్టాలనే ఈ మంకుపట్టు ఏమిటి? పంచాయితీ ఎన్నికలు జరుపుతామంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది?

కరోనా తీవ్రంగా ఉంటే పంచాయితీ ఎన్నికలు ఎలా జరుపుతారు అంటూ ప్రశ్నించలేదా? ప్రభుత్వ ఉద్యోగస్థుల సంఘాల వారు కరోనాతో మమ్మల్ని చంపుతారా? అంటూ ప్రశ్నించలేదా? అప్పుడు కరోనా ఇంత తీవ్రంగా లేదు.

ఇప్పుడు సెకండ్ వేవ్ దారుణంగా ఉంది. ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత వైద్య సౌకర్యాల కొరత, వ్యాక్సిన్ ల కొరత…. ఇప్పుడు పరీక్షలు పెడతారా? ఎందుకు ఈ మంకుపట్టు. అమరావతి నుంచి రాజధాని ని మార్చడానికి ఇదే మంకుపట్టు. సంగం డైరీని ఆక్రమించుకోవడానికి ఇదే మంకుపట్టు.. ఏమిటి ఇది?

సరే… అవి రాజకీయ నిర్ణయాలు.. ఇదే మంకుపట్టు విద్యార్థులపై కూడా చూపిస్తారా? అందరూ వద్దంటుంటే పరీక్షలు పెట్టితీరుతాం అంటూ ఈ మంకుపట్టు ఏమిటి? పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తే మా ప్రాణాలకు ఎన్నికల కమిషనర్ బాధ్యత వహిస్తాడా? అని ఉద్యోగ సంఘాల నాయకులు రోడ్డెక్కి గోల చేశారు. మరి ఇప్పుడు విద్యార్ధులకు కరోనా సోకితే ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహిస్తారా?

Related posts

ఈ స్కూల్ ను కాపాడకపోతే ప్రభుత్వమే వేస్టు

Satyam NEWS

తెలంగాణ ఎమ్మార్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

Satyam NEWS

ఎంపీ ధర్మపురి అరవింద్ పైన దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి

Satyam NEWS

Leave a Comment