36.2 C
Hyderabad
April 25, 2024 22: 21 PM
Slider జాతీయం

పనికి మాలిన రాజద్రోహం చట్టం ఇంకా ఎందుకు?

#chief justice n v ramana

రాజద్రోహం పేరుతో కేసులు పెట్టడాన్ని భారత ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ తప్పు పట్టారు. పిచ్చోడి చేతిలో రాయిలా మారిన ఈ  సెక్షన్ 124 ఏ అవసరమా అని ఆయన ప్రశ్నించారు. బ్రిటీష్ పాలకులు అప్పటి స్వాతంత్ర్య సమర యోధులను అరెస్టు చేసి హింసించేందుకు నిర్దేశించుకున్న ఈ  సెక్షన్ 124 ఏ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అవసరమా అని చీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ప్రశ్నించారు.

సెక్షన్ 124 ఏ చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ రిటైర్డ్ మేజర్ జనరల్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్ కేర్ పిటిషన్ దాఖలు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేసి.. సెక్షన్ 124ఏ పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 124 ఏ సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్నారు.

ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనన్నారు. ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడగలుగుతారని పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి.. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు ఉన్నాయన్నారు. ఇంకా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? పరిశీలించాల్సిన సమయం అసన్నమైంది.

పాత కాలపు.. పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం.. ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? కొయ్యను మల్చడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉంది. వ్యవస్థలకు, వ్యక్తులకు ఈ చట్టం వల్ల తీరని నష్టం జరుగుతోంది. 124ఏ సెక్షన్ రద్దు చేయాలని ఎడిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు.. అన్నింటినీ కలిపి విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Related posts

ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్

Satyam NEWS

ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌పోలీసులు, ఈసీ

Sub Editor

19న‌ హరితోత్స‌వంలో పాల్గొన‌నున్న సీయం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment