33.2 C
Hyderabad
June 20, 2024 20: 02 PM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఆ భూముల అసలు కధ వేరు

pjimage (8)

ఉమ్మడి రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పేట మండలం జయంతి పురం మండలం లో సిమెంటు కంపెనీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రైల్వే లైన్ ఉండటం, ఇప్పటికే పరిశ్రమలు ఉండటంతో మౌలిక సదుపాయాలూ ఉన్నాయని ముడి సరుకు అయిన బొగ్గు, గ్యాస్ సరఫరాకు రవాణా మార్గమున్నందున ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు అనువైనది వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వానికి దరకాస్తు చేసింది. అయితే అప్పటికే వేరే సంస్థకు ప్రభుత్వం 498 ఎకరాలను కేటాయించింది.

రాజకీయ పలుకు బడితో ఆ భూములను రద్దు చేయించి, తిరిగి  పొందాలన్నది విబిసి డైరెక్టర్ ఆలోచన. జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామం సర్వేనెంబర్ 93 లో గల 498 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భాగం గతంలో కొండలరావు అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది. ఆ కేటాయింపులను కిరణ్ర్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసి ఏపీఐఐసీ కి బదలాయించింది. అయితే విబిసి సంస్థ తమకు ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు ఈ స్థలం కేటాయించాలని 04. 10. 2013 న దరకాస్తు చేసింది.

అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, రాష్ట్రం లో గవర్నర్ పాలన రావటంతో ఆ ఫైల్ మందికి కడలలేదు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన వెంటనే విబిసి సంస్థ 28. 6.2014 న తిరిగి ప్రభుత్వానికి దరకాస్తు చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆ ప్రతిపాదనను ఏపీఐఐసీ కి పంపటం, ఏపీఐఐసీ ఈ ఒక్క ఫైల్ నే 14. 5. 2015న ప్రభుత్వానికి పంపటం, పరిశ్రమల శాఖ దానిపై అదే నెల 30వ తేదీన ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపటం చక చకా జరిగిపోయాయి.

ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం కేవలం 45 రోజులలోనే క్యాబినెట్ లో ఆమోద ముద్ర వేసి జిఓ 269 ని 15. 7. 2015న జారి చేసింది. 30 సంవత్సరాలనుంచి సర్వసం పోగుట్టుకున్న సీనియారు కార్యకర్త కాగితం కదలటానికి 5 సంవత్సరాలు పడితే సుమారు 500 ఎకరాల భూమి కేవలం ఒక సంవత్సరకాలంలోనే ఆమోదం పొందింది అంటే ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు.

ఈ ఫైల్ నడుస్తూన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు హైదరాబాద్ నుంచి నడిచేవి. అప్పట్లో లోకేష్, చంద్రబాబు కార్యాలయంలోని వ్యక్తులు ఈ ఫైల్ నడిపించే బాధ్యతను తీసుకున్నారని తెలిసింది. విబిసి ఫెర్టిలైజర్స్అండ్ కెమికల్స్ లిమిటెడ్ 1991 వ సంవత్సరంలో ఏర్పాటు అయింది. శ్రీకాకుళం జిల్లా పొన్నాడలో ఒక కర్మాగారం ఉండేది. నష్టాలు రావటం తో కంపెనీని విక్రయించారు. దీని ఫై అప్పట్లో కొన్ని కేసులు కూడా నడిచినట్లు తెలిసింది. దీని తరువాత ఈ కంపెనీ తరుపున ఇవే విధమైన ఉత్పత్తులు జరిగినట్లు లేదు.

విబిసి ఫెర్రో, కోనసీమ, గీతం విద్యా సంస్థలే కార్యకలాపాలు నిర్వహించేవి. కాలక్రమేణా విబిసి ఫెర్రో కొన్నాళ్ళు మూత పడగా, గ్యాస్ లేక కోనసీమ మూట పది ప్రస్తుతం కేంద్ర కంపెనీ లా ట్రిబ్యునల్ వద్ద కేసు పెండింగ్ లో ఉంది. దీనికి తోడు గ్యాస్ సరఫరా లేకుండా ఎరువులు ఉత్పత్తి చేస్తామని బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి కి తెలియ చెయటం  మరో వింత.

ఎన్ని విశేషాలు కూడా గట్టుకున్న ఈ సంస్థ కు తెలుగుదేశం హయాంలో మేలు జరగలేదు అని విశాఖ లోక్ సభకు పోటీచేసి ఓడిపోయిన భరత్ చెప్పటం దానిని సీనియర్ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్ధించటం దానిని పచ్చ మీడియా రచ్చ చేయడం మరో పెద్ద విశేషం.

ramakrishna-mutnuru-1
ముట్నూరు రామకృష్ణ               

Related posts

వెల్ డన్: మంత్రి పువ్వాడకు కేటీఆర్ అభినందన

Satyam NEWS

ఇలాంటి పోలీసుల్ని పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు నీతులు చెబితే ఎలా?

Satyam NEWS

అక్టోబర్ కు 1.50 లక్షల టిడ్కో గృహ ప్రవేశాలు

Satyam NEWS

Leave a Comment