38.2 C
Hyderabad
April 25, 2024 12: 26 PM
Slider నల్గొండ

స్వచ్ఛంద బందులో వైన్ షాపులకు మినహాయింపు ఎందుకు

#Wines Shop

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్వచ్ఛందంగా అన్ని వర్గాలవారు బందు పాటిస్తున్నారు. కానీ  వైన్ షాపులు మాత్రం తెరిచే ఉంటున్నాయి. టాక్స్ పేయర్స్ కి కరోనా రాదా? తాగి రోడ్డు మీద పడిపోయి ఎటువంటి  ప్రమాదాలు జరుగుతాయో తెలియని స్థితిలో త్రాగినవారు మారుతారు.

వారిని తాగుబోతులని తిట్టిన, కొట్టిన, కరోనా పేషెంట్లు పక్కనే ఉన్న, పట్టించుకోలేని దీనస్థితిలో ఉంటారు. వారు కరోనా బారిన పడి వారి కుటుంబాలను కూడా బలి తీసుకునే పెను ప్రమాద అవకాశం ఉంది. వారిని కాపాడుకునే బాధ్యత కూడా మనపై ఉందని విన్నపం ఒక పోరాటం సభ్యురాలు చీకూరి లీలావతి తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఉపాధి లేక రోడ్డున పడే స్థితిలో వైన్ షాపుల యజమానులు లేరు. స్వచ్ఛంద బంద్ పాటించాలనే నియమం వారికి కూడా వర్తింపచేయాలి. అవేమన్నా అత్యవసర మెడికల్ షాపులా? “విన్నపము ఒక పోరాటం” తరఫున  కోరేది ఒక్కటే.

సంబంధించిన అధికారులు వైన్ షాపులను కూడా బందు చేయించే బాధ్యత తీసుకొని ప్రజలకు రక్షణగా నిలవాలని వినయంగా కోరారు. లేని ఎడల స్వచ్ఛంద  బందుని మేము వ్యతిరేకిస్తామని విన్నపం ఒక పోరాటం సభ్యురాలు చీకూరి లీలావతి అన్నారు.

Related posts

పేద విద్యార్థులకు బత్తినేని చారిటబుల్ ట్రాస్ట్ ఆర్ధిక సహాయం

Satyam NEWS

బీసీ సీఎం అంశం బీజేపీకి కలిసి వచ్చేనా?

Satyam NEWS

అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలి

Satyam NEWS

Leave a Comment