37.2 C
Hyderabad
April 19, 2024 14: 47 PM
Slider ప్రత్యేకం

వితంతు పెన్షన్ పేరు మార్చాలి

#sabitaindrareddy

వితంతు పెన్షన్ అనే పేరు మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉందని అందువల్ల తక్షణమే ఆ పేరు మార్చాలని ‘విన్నపం ఒక పోరాటం’ అధ్యక్షురాలు చీకూరి లీలావతి కోరారు. వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ పేర్లను మార్చాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కి వినతి పత్రం అందజేశారు. నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో ముందుకు పోతుంటే ప్రభుత్వాలు ఇలాంటి పేర్లను ఇంకా తొలగించ కుండా కొనసాగించటం శోచనీయమని లీలావతి అన్నారు. వితంతువు స్థానంలో  ‘చాకలి ఐలమ్మ’ పేరుపెట్టాలని, ఒంటరి మహిళ స్థానంలో ‘శక్తి మహిళ’ పేరు మార్చాలని వివరించామని తెలిపారు. ‘విన్నపం ఒక పోరాటం’ సభ్యులు సూచించిన పేర్లు ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తాను స్వయంగా తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగిందని లీలావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో షమేటి విజయలక్ష్మి, ఏ.లతా,శబ్ద, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన సెట్విన్

Satyam NEWS

కొమురవెళ్లి జాతరలో సినీ హీరో సుమన్ సందడి

Bhavani

కదం తొక్కిన కర్షకులు: మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్

Satyam NEWS

Leave a Comment