39.2 C
Hyderabad
March 29, 2024 13: 36 PM
Slider జాతీయం

రాహుల్ ‘జోడో’ యాత్ర రాజస్థాన్ రేఖ మార్చేనా?

ఉప్పు నిప్పుగా ఉండే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మళ్లీ ఒక వేదికపైన కనిపించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర సన్నాహక సమావేశం కోసం ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదికపై కనిపిస్తున్నారనే విషయం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. సెప్టెంబర్ 25న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం తర్వాత రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది.ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాల్, సచిన్ పైలట్ కలిసి కనిపించలేదు. రాజకీయ సంక్షోభం తర్వాత రెండు నెలలకు ఇద్దరు నేతలూ ఒకే చోట చేరారు. భారత్ జోడో యాత్ర కోసం రాజస్థాన్‌ కాంగ్రెస్ సన్నాహాలు ప్రారంభించింది. భారత్ జోడో యాత్రకు చెందిన 33 మంది నేతల సమన్వయ కమిటీ తొలి సమావేశం బుధవారం కాంగ్రెస్ వార్ రూమ్‌లో జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హాజరు అయ్యారు. రాష్ట్ర ఇంచార్జి అజయ్ మాకెన్ భారత్ జోడో యాత్ర కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు గా ఉన్నారు. అయితే రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజకీయ గందరగోళం తర్వాత మాకెన్ తన రాజీనామాను సమర్పించారు. అందువల్ల ఆయన ఈ సమావేశానికి హాజరుకాలేదు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత రాజస్థాన్‌లో సచిన్‌ పైలట్‌కు అధికారం అప్పగించవచ్చని వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 25న జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని గెహ్లాట్ అనుకూల మంత్రులు బహిష్కరించారు. ఆరోజు మంత్రి శాంతి ధరివాల్ ఇంట్లో ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఆ తర్వాత మంత్రి శాంతి ధరివాల్, మహేష్ జోషి సహా ఇతర ఎమ్మెల్యేలు స్పీకర్ సీపీ జోషికి రాజీనామాలు సమర్పించారు. ఇప్పుడు కథ క్లయిమాక్స్ కు చేరింది.

Related posts

నిరుద్యోగులకు శుభవార్త: ఎక్సైజ్, ఫారెస్ట్, ఫైర్ సర్వీసు ఖాళీల భర్తీకి అనుమతి

Satyam NEWS

మినీ స్టేడియం వారంలో పూర్తి కావాలి

Murali Krishna

వరుణ్ తేజ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన అభిమానులు

Satyam NEWS

Leave a Comment