39.2 C
Hyderabad
April 25, 2024 17: 47 PM
Slider తూర్పుగోదావరి

మద్యం షాప్ కార్మికుల సమస్యలపై 28 న రాష్ట్ర బంద్

#wineshops

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ వైన్ షాప్ లలో పనిచేస్తున్న సూపర్ వైజర్ ,సెల్సమాన్ ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రి బెవరేజెస్ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఎంకు అందచేశారు. ఈ ధర్నాకు హమాలీ కార్మికులు సంఘీభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి APSBC అవుట్ సౌర్చింగ్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ రెడ్డి ఎంట్రప్రెస్స్ వారు కార్మికుల జీతాల నుండి పిఎఫ్ సొమ్మును కార్మికుల ఖాతాలోకి వెయ్యకుండా కార్మికుల సొమ్మును కాజేశారని అన్నారు. సంవత్సరం నుండి ఈ విషయం పై పలుమార్లు ఉన్నత అధికారులకు మొర పెట్టుకున్నా స్పందన లేదని అన్నారు. రెడ్డి సంస్థను రద్దు చేసి apcos లో కలాపాలను అన్నారు. ఇరవై లోగా తమ సమస్యలు పరిష్కరించకుంటే 28 న వైన్ షాప్ బంద్ లు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నల్ల రామారావు, జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, కిర్ల కృష్ణ రామచంద్ర రావు, సత్యనారాయణ, వెంకటరావు, తులసీరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ కు ధీటుగా ఖమ్మం అభివృద్ధి

Bhavani

బాగ్ అంబ‌ర్ పేట్‌లో నూత‌న మ్యాన్ హోల్స్ నిర్మాణం

Sub Editor

విజయనగరం జిల్లాలో 9 కోర్టులలో లోక్ అదాలత్…ఎప్పుడంటే…?

Satyam NEWS

Leave a Comment