31.2 C
Hyderabad
April 19, 2024 05: 03 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో వైన్ షాపు తరలింపునకు అధికారుల హామీ

#wanaparthypolice

వనపర్తిలోని వల్లభనగర్ 33వ వార్డులో ఉన్న వైన్ షాపును ఇతర ప్రదేశానికి తరలిస్తామని ఎక్సయిజ్ అధికారులు తెలిపారు. వైన్ షాపును తరలించాలని,అనుమతి ఇవ్వరాదని టీఆర్ఎస్ నేత,మాజీ కౌన్సిలర్ ఉంగలం తిరుమల్ తో పాటు కాలనీ వాసులు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. కాగా వనపర్తిలోని వివిధ ప్రాంతాల్లో వైన్ షాపుల్లో మద్యం సేవించిన వారు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారు.వైన్ షాపు ఒక చోట,సిట్టింగ్ మరో చోట ఏర్పాటు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, వారికి సహకరించే వారిపై,మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే త్రాగుబోతులపై కేసులు నమోదు చేయాలని పలువురు కోరుతున్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

ఎడ్వయిజ్: రోగ నిరోధక శక్తిని పెంచుకోండి

Satyam NEWS

28న రామప్ప కు ముర్ము

Murali Krishna

హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలగిన జిలానీ

Satyam NEWS

Leave a Comment