కన్ను కొట్టి యువతను మత్తులో ముంచెత్తిన ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుంది కదా? ఏడాది క్రితం వాలెంటైన్స్ డే నాడు బయటకి వచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ క వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అప్పటి వరకూ అసలు ఎవరికీ తెలియని ప్రియా ప్రకాష్ వారియర్ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. మలయాళ సినిమా ఒరు అదార్ లవ్ నుంచి టీజర్ గా బయటకి వచ్చిన వింక్ వీడియో, ప్రియా ప్రకాష్ ని నేషనల్ క్రష్ గా మార్చింది. కేసులు, వివాదాలతో చాలా రోజులు డిలే అయిన తర్వాత ఒరు అదార్ లవ్ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. అయితేనేం ప్రియా ప్రకాష్ కి కావాల్సినంత ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో ఈ కేరళ కుట్టి డైరెక్ట్ గా హిందీ సినిమానే మొదలుపెట్టింది. శ్రీదేవి బంగ్లా అంటూ తెరకెక్కిన సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ప్రియా ప్రకాష్ వారియర్ ఈ ట్రైలర్ లో అక్కడక్కడా గ్లామర్ గా కనిపించి, బాలీవుడ్ వర్గాల దృష్టిలో పడింది. తెలుగులో నితిన్ పక్కన కూడా ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆఫర్స్ రాబట్టి బిజీ అవ్వాలి అనుకుందో ఏమో కానీ ఎప్పుడూ ఫోటోషూట్స్ తో బిజీగా ఉండే ప్రియా ప్రకాష్ స్విమ్మింగ్ పూల్ లో దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రియా స్విమ్మింగ్ పూల్ లో ఉన్న హాట్ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
previous post
next post