33.2 C
Hyderabad
March 22, 2023 20: 34 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

నవంబర్ 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Indian_Parliament

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చేనెల​ 18 నుంచి ప్రారంభం కానుకన్నాయి. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్​ కమిటీ(సీసీపీఏ) సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. నవంబర్​ 18న నుంచి డిసెంబర్​ 13 వరకు సమావేశాలు సాగనున్నట్లు తెలిసింది. అధికారికంగా షెడ్యూల్​ వెల్లడికానప్పటికీ దాదాపు ఇవే తేదీలు ఖరారయ్యే అవకాశముంది. గత ఏడాది పార్లమెంట్​ శీతాకాలం సమావేశాలు డిసెంబర్​ 11న ప్రారంభమై 2019 జనవరి 8 వరకు కొనసాగాయి. ఈ ఏడాదిలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పూర్తి కాలం జరిగిన పార్లమెంటు సమావేశాలు అవే. సభ జరగనున్న కాలం, సెషన్​ సిట్టింగ్​లపై వచ్చే వారం జరగనున్న కేబినెట్​ భేటీ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో పార్లమెంట్​ ఉభయసభల్లో చర్చించాల్సిన అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశాల్లో రెండు కీలక అత్యవసరాదేశాలను చట్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ముఖ్యంగా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ ‘దేశీయ కంపెనీలకు కార్పొరేట్​ పన్ను తగ్గింపు’ను చట్టంగా మార్చాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్​ సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి నిషేధంపై జారీ చేసిన ఆర్డినెన్స్​నూ చట్టంగా రూపొందించే అవకాశముంది. మరిన్ని కీలక బిల్లులను ఈ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

Related posts

కరోనా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత

Satyam NEWS

తెలంగాణ లో తగ్గుతున్న కరోనా వైరస్ వ్యాప్తి

Satyam NEWS

జో బైడెన్ గెలుపును ఖరారు చేసిన అమెరికన్ కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!