27.7 C
Hyderabad
April 24, 2024 10: 12 AM
Slider విజయనగరం

ఉన్నతమైన ఆశయం, దృఢ సంకల్పంతో దేన్నైనా సాధించవచ్చు

#Dr.BR Ambedkar Gurukulam

విజయనగరం నెహ్రూ కేంద్రం యువజన యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులం నెల్లిమర్ల లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం జరిగింది. జిల్లా యువజన అధికారి జి.విక్రమాదిత్యా ఈ కార్యక్రమం లక్ష్యం యువతకు వివిధ కెరీర్ ఎంపికల గురించి సమాచారాన్ని అందించి, ముఖ్యమైన కెరీర్ అవకాశాల గురించి వారికి తెలియజేసారు.

స్వల్పకాలిక లక్ష్యాలను సొంత సంకల్పంతో లేదా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే మార్గంలో శ్రమించి గెలుపొందిన, ఉన్నత స్థానంలో ఉన్న వారిని అనుసరించడం మరియు లక్ష్య సాధనలో ఎంతటి క్లిష్ట సమస్య వచ్చిన వాటిని, అధిగమించే ప్రయత్నం చేయాలి అని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు సుపెరిండెంటెంట్ అఫ్ పోలీస్ ఆస్మా ఫర్హీన్ తెలిపారు.

అలాగే డీ ఎస్ పి గ్రూప్ వన్ అధికారిగా ఎంపిక అయ్యే ప్రక్రియలో ఎదుర్కొన్న సమస్యలపై,ఒక మహిళగా ఎదుర్కొన్న సంఘర్షణల గూర్చి బాలికలకు వివరంగా తెలియజేసి వారిలో స్పూర్తిని నింపారు. ఆడపిల్లలు బాల్యవివాహాలు చేసుకోకుండా ఉండాలని మరియు డిగ్రీ చేసి ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించే విధంగా పోటీ పరీక్షలకు ప్రణాళికతో సన్నదం కావాలని ఈ సందర్భంగా అదనపు ఎస్పి ఆస్మా ఫర్హీన్ కోరారు.

యువత తమ విద్యా సామర్థ్యాలు, గుణాలు, ప్రతిభ, అభిరుచులు, వ్యక్తిత్వం, విలువలు, అంచనాలు మరియు వనరులను అర్థం చేసుకోవడానికి సరైన కెరీర్ ప్రణాళికను రూపొందించడంలో గందరగోళం అనిశ్చితి నుండి బయటపడటానికి అధికారుల సూచనలు సహాయపడతాయని, కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఉషారాణి అన్నారు.

ప్రముఖ సైకాలజీ నిపుణులు ఎ.వి.రాజశేఖర్ కౌన్సెల్లింగ్ లొ భాగంగా విద్యార్థుల మానసిక ఉద్వేగల అదుపు మరియు పోటీ పరీక్షలలో విజయానికి కావలసిన మనోబలం పై ప్రయోగాత్మక అవగాహన కల్పించారు. విద్యార్థులలో పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు మనసు దాని అంతర్గత శక్తి సామర్ధ్యాల ఉపయోగ విధానాలపై ఎవరికి వారు తెలుసుకునేలా వివరించారు.

మనసు-మెదడుల పనితీరుపై విశ్లేషించి అంతర్గత స్థోమతను, జ్ఞాపకశక్తి సాధన సామర్ధ్యాలను కూడగట్టుకునే పరిశోధన పద్ధతులు వాటి విధి విధానాలు తెలిపారు. కార్యక్రమం మొత్తం…జిల్లా లోని నెల్లిమర్ల లోని డా బి.ఆర్ అంబేద్కర్ గురుకులం లో ఏర్పాటు చేసిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఊషరాణి,స్పెషల్ ఎన్ఫోర్సెమెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్,సబ్ ఇన్స్పెక్టర్ జానకి,సైకలాజి నిపుణులు ఎ.వి.రాజశేఖర్,ఎన్ వై కే ఏ ఓ పృత్వి,వాలంటీర్ హేమంత్,శ్రావణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముసద్దీలాల్ జ్యువెలర్స్‌లో ఈడీ తనిఖీలు

Satyam NEWS

కర్నూలు జిల్లా లో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Satyam NEWS

రావికొండలరావుకు జీవిత సాఫల్య పురస్కారం

Satyam NEWS

Leave a Comment