32.2 C
Hyderabad
April 20, 2024 21: 12 PM
Slider ముఖ్యంశాలు

ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారు?

#vishnuvardhanreddy

ఆర్టీసీ ప్రత్యేక ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని బిజెపి రాష్ట్ర పార్టీ డిమాండ్ డిమాండ్ చేసింది. తెలంగాణలో లేని బస్సు ఛార్జీల పెంపు, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఎందుకు? వారివి మాత్రం బస్సులు కావా? వారు వాడేది డీజిల్ కాదా అని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం మద్యం ధరలు, సినిమా టికెట్ల రేట్లలో చూపించిన శ్రద్ధ, పేద ప్రయాణికుల బస్సు ఛార్జీల విషయంలో ఎందుకు చూపించడం లేదని ఆయన ప్రశ్నించారు. చిన్న సినిమాను,పెద్ద సినిమాను ఒకేలా చూసిన వారు,సాధారణ బస్సులను, ప్రత్యేక బస్సులను ఒకేలా ఎందుకు చూడలేకపోతున్నారు? పండుగ బస్సుల్లో 50 శాతం రేట్ ఎందుకు ఎక్కువ? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సమయంలో పేదలపై భారం మోపడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

Related posts

ఆడిట్ రిపోర్ట్: చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలు

Satyam NEWS

భారత్ మాకు బలమైన భాగస్వామి: జో బిడెన్

Satyam NEWS

16 నుంచి పల్నాటి జిల్లా ఉత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment