ఆర్ధిక మాంద్యం ఉన్నా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఢోకా లేకుండా చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో 33/11 కెవి సబ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ కేంద్రం నుండి రావాల్సిన నిధులు కూడా రావడం లేదని చెప్పారు. ఆర్థిక మాంద్యం ఉన్న ప్రజా సంక్షేమానికి డోకా లేకుండా చేస్తున్నామని ఆయన అన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం పనితీరు ను పక్క రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తున్నాయని మహా రాష్ట్ర, బీదర్, గుల్బర్గా ప్రాంతాలు మమ్మల్ని కూడా తెలంగాణ లో కలుపుకోండని అంటున్నాయని ఆయన అన్నారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాకే నిరంతరాయంగా కరెంట్ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం లో కరెంట్ ఎప్పుడూ వస్తుందో… ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని ఆయన అన్నారు. దేశంలో 24 గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ యేనని ఆయన అన్నారు