28.2 C
Hyderabad
April 20, 2024 11: 58 AM
Slider ప్రపంచం

డ్రెస్ బాగా లేదని:పార్లమెంట్ నుంచి మహిళా ఎంపి బహిష్కరణ

woman m p removed from parliament for wearing tight fitting dress in tanzania

టాంజానియా పార్లమెంటులో ఓ మహిళా ఎంపీ టైటు డ్రెస్ వేసుకుని వచ్చిందని సాక్షాత్తూ స్పీకరే ఆమెను పార్లమెంట్ నుంచి బహిష్కరించిన ఘటన సర్వత్రా చర్చనీయాంశమయింది. టాంజానియా పార్లమెంటులో మహిళా ఎంపీ కండెస్టర్ సిచ్వాలే బిగుతైన దుస్తులు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఆమె పార్లమెంట్ హాల్లోకి రాగానే తోటి సభ్యులు ఆమె డ్రెస్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో స్పీకర్ జాబ్ ఎండుగై కూడా ఆమె డ్రెస్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టసభలకు వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకునిరావాలని సూచించారు. అనంతరం ఎంపీ కండెస్టర్ సియ్వాలే చర్యలు తీసుకున్నారు. సిచ్వాలే వెంటనే పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తున్నామని ఆమె వెళ్లిపోవాలని ఆదేశించారు. స్పీకర్ ఆదేశాలతో ఎంపీ పార్లమెంట్ నుంచి బయటకు వెళ్లిపోయారు.ఈ ఘటన పై కొందరు ఆమెకు మద్దతు ఇస్తుండగా మరి కొందరు ఆమెను విమర్శిస్తున్నారు.

Related posts

ఆస్రా పోస్టర్ ఆవిష్కరించిన న్యాయమూర్తి

Satyam NEWS

మునిగిపోతున్న మహిళల్ని కాపాడిన పోలీసులు

Bhavani

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

Bhavani

Leave a Comment