27.7 C
Hyderabad
April 26, 2024 03: 59 AM
Slider మహబూబ్ నగర్

మహిళలకు నరకం చూపిస్తున్న గ్రామ సమైక్య సంఘం

#DWAKRA

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నగరంలో ని గ్రామ సమాఖ్య సంఘం వారు మహిళా గ్రూపు లీడర్లకు నరకం చూపిస్తున్నారు. దీనితో గ్రూప్ లీడర్లు గ్రూపులోని మహిళల ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వపరంగా మహాలక్ష్మి , స్త్రీ నిధిల నుండి తీసుకున్న రుణాలకు గాను నెల నెల చెల్లించే కిస్తులు ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా చెల్లించాలంటూ   గ్రూప్ లీడర్ ల పై ఒత్తిడి చేయడంతో గ్రూప్ లీడర్లు కూడా గ్రూపులోని మహిళలకు ఒత్తిడి చేయటం తప్పడంలేదు.

లాక్‌డౌన్‌ సందర్భంగా ఇంటి నుండి బయటికి వెళ్ళ లేక పోతున్నామని పనులు సాగడం లేదని కిస్తులు ఏవిధంగా చెల్లించాలి తెలియడం లేదని మహిళా గ్రూపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు గ్రామ సమైక్య సంఘం వారిపై రుణాలు మంజూరు అయినప్పుడు తమ దగ్గర కమిషన్లు వసూలు చేసుకుప్పుడు తమకు అనుగుణంగా ఉండి  ఇప్పుడు నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ కు ప్రస్తుత లాక్ డౌన్ సందర్భంగా పైసలు కట్టలేని పరిస్థితులని లాక్ డౌన్ అనంతరం నెల నెల  కొన్ని కొన్ని రూపాయలు కట్టే విధంగా ఆదేశించాలని తమను మానసిక వేదనకు గురికాకుండా  కాపాడాలంటూ కల్వకుర్తి మహిళలు జిల్లా కలెక్టర్ కు విన్నవించుకుంటున్నారు.

Related posts

58,59 జి ఓ ప్రకారం క్రమబద్దీకరణ పూర్తి చేయాలి

Bhavani

భారీ హోర్డింగ్ లతో ప్రచారం

Murali Krishna

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్

Satyam NEWS

Leave a Comment