30.7 C
Hyderabad
April 19, 2024 07: 50 AM
Slider ఆదిలాబాద్

మహిళతో పాటు ఏడుగురు మట్కా నిర్వాహకులు అరెస్టు

#adilabadmatka

ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో మొదటిసారిగా తెరపైకి వచ్చిన ప్రధాన అంశం ఒక మహిళ మట్కా నిర్వాహకురాలిగా అవతారమెత్తి ఆన్ లైన్ ద్వారా మట్కా జూదం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మంగళవారం విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ ఈ.చంద్రమౌళి ఆధ్వర్యంలో రెండవ పట్టణ ఎస్సై కే విష్ణు ప్రకాష్, మహిళా కానిస్టేబుళ్లు మౌనిక, మమతలతో కలిసి రైల్వే క్వార్టర్స్ లో దాడులు నిర్వహించి ఓ ఇంట్లో సోదాలు చేయగా గొండా పద్మావతి,@ విజయలక్ష్మి (50) ఆన్ లైన్ లో మట్కా జూదం నిర్వహిస్తూ పట్టుబడింది.

మొబైల్ ఫోన్ తనిఖీ చేయగా మట్కా నిర్వహిస్తున్న ఆధారాలు లభ్యమయ్యాయి. ఆమె వద్ద రూ,4420/- నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరో సమాచారం మేరకు ఖుర్షీద్ నగర్ కాలనీలో మట్కా నిర్వాహకుడు షేక్ రౌఫ్ (24) ను అరెస్టు చేసి అతని వద్ద రూ.2050/- మట్కా చిట్టిలను స్వాధీనం చేసుకొని, సుందరయ్య నగర్ కాలనీ వద్ద మట్కా నిర్వాహకుడు షేక్ ఇర్షాద్,(30) ను అదుపులో తీసుకొని అతని వద్ద రూ.2100/- నగదు, మట్కా చిట్టి లను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ ఏ. హరిబాబు తో కలిసి దస్నాపూర్ కాలనీలో మట్కా స్థావరంపై దాడులు చేసి షేక్ తాజుద్దీన్, (37) మహమ్మద్ ఆలీం,(34) కిషన్ (40) ముగ్గురు మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి వారి వద్ద రూ.3060/-నగదు మట్కా చిట్టిలను స్వాధీనం చేసుకున్నారు. మరో సమాచారం మేరకు విద్యానగర్ కాలనీలో మట్కా నిర్వాహకుడు జహీర్ బిన్ అబ్దుల్లా ను అదుపులో తీసుకొని అతని వద్ద రూ.4139/-నగదు మట్కా చిట్టి లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ మాట్లాడుతూ మొదటిసారిగా మట్కా నిర్వహిస్తున్న మహిళను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పరుచుకున్న టాస్క్ ఫోర్స్ బృందం పట్టణంలో ఐదు చోట్ల మట్కా స్థావరాలపై వరుస దాడులు చేసి మహిళతో పాటు ఏడుగురు మట్కా నిర్వాహకులను అరెస్టు చేసి రూ.17,760/-నగదు, ఒక మొబైల్ ఫోన్, మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా మట్కా, గుట్కా సమాచారం ఉన్నచో పోలీస్ వాట్సాప్ నెంబర్ 8333986898 కు సమాచారం అందించి పోలీస్ శాఖకు తోడ్పడాలని కోరారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఏఎస్ఐ ఎస్కే తాజుద్దీన్, మహిళా కానిస్టేబుళ్లు, మౌనిక, మమతా, టాస్క్ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

మా జోలికి వస్తే మేం ఊరుకుంటామా? అంటున్న తేనెటీగలు

Satyam NEWS

షర్మిల తో మాట్లాడలేదు… జానారెడ్డి

Bhavani

రెండు ద‌శాబ్దాల పాటు రిమార్క్ రాకుండా ప‌ని చేసిన వారికి స‌ర్టిఫికెట్లు

Satyam NEWS

Leave a Comment