బిచ్కుంద మండలం లోని గుండె నెమిలి గ్రామానికి చెందిన లలిత వయసు 32 చికిత్స పొందుతూ నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంగళవారం రాత్రి మృతి చెందింది. బిచ్కుంద ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం లలిత భర్త కొన్ని సంవత్సరాల నుండి దుబాయ్ లో ఉంటున్నాడు.
గత ఇరవై రోజుల క్రితం గుండె నెమలి గ్రామంలోని తన ఇంటిలో అత్తమామలు, కుటుంబీకుల వేధింపులు తాళలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు ఆమె పెద్ద కూతురు నిరోష మంటలను ఆర్పి బాన్స్వాడ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు, భర్త ఉన్నారు. మృతురాలి తండ్రి పట్నం సాయిలు ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.