28.7 C
Hyderabad
April 20, 2024 10: 29 AM
Slider మహబూబ్ నగర్

పోడు భూముల రైతుల కడుపుల పై పాలకుల పోటు

#mukkidigundam

పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా రైతు

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడి గుండం గ్రామ సమీపంలో పోడు భూముల్లో ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల కడుపుల పై పాలకులు పోటు పొడుస్తున్నారు. బుదవారం  హరితహారం పేరుతో అడవుల్లో మొక్కలు నాటాలని ఫారెస్ట్ అధికారులు భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లారు.

ఆ భూములపై ఆధారపడి సాగు చేసుకుంటున్న గిరిజన మహిళా రైతులు అధికారుల కాళ్లు పట్టుకొని వేడుకున్నారు. ఒక మహిళ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే రైతులు  కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అటవీ శాఖ అధికారులతో పాలకులే ఈ దాడులు చేయిస్తున్నారని స్థానికులు అంటున్నారు. పాలకుల ప్రేమేయం లేకుండా ఫారెస్ట్ అధికారులు భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని పలువురు ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందని వారు  అంటున్నారు.

పాలకులు బయటపడకుండా  ఈ చర్యలకు పాల్పడుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే  ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ భూములను వదులుకునే ప్రసక్తే లేదని సాగు చేసుకుంటున్నా  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఏళ్ళు, ఎన్ని రోజులు కాళ్లు పట్టుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయినా ప్రభుత్వాన్ని కనికరం రావడంలేదని ఆవేదన గురవుతున్నారు. గత ఏడాది ఎమ్మెల్యే, అధికారులు వచ్చి హామీ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు హరితహారం పేరుతో దాడులు చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నాం రైతులకు అటవీ హక్కుల చట్టం ద్వారా  పట్టాలు ఇవ్వాలని  సిపిఎం మండల కార్యదర్శి శివ వర్మ డిమాండ్ చేస్తున్నారు.

Related posts

రెండో అధికార భాష గా ఉర్ధూ

Sub Editor 2

వరద ముంపుకు గురైన బుడగ జంగాల ను ఆదుకుంటాం

Satyam NEWS

ఏప్రిల్ 15 వరకు ఎవ్వరు కూడా బయటకు రావద్దు

Satyam NEWS

Leave a Comment