35.2 C
Hyderabad
April 24, 2024 12: 56 PM
Slider మహబూబ్ నగర్

మహిళల కోసం  అందుబాటులో ఉంటాం

#wanaparthy

మహిళలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగి, జాగ్రత్త గా ఉండాలని జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి కోరారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు 2కె రన్ ను జిల్లా పోలీస్ శాఖ తరపున  విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాఇంచార్జి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ  రక్షిత కె మూర్తి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఇంచార్జి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా వనపర్తి జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని మహిళలకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి  జిల్లా ఎస్పీగా  మహిళా అధికారి ఉండడం అదృష్టంగా భావించవచ్చని తెలిపారు. మహిళల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు. సైబర్ నేరాలపై మహిళలు  పూర్తి అవగాహన కలిగి జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ  రక్షిత కే మూర్తి కోరారు.

వనపర్తి జిల్లా పోలీస్ షీ టీం ను మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ అన్నారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడైనా రావచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి జానకి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వనపర్తి, అడిషనల్ కలెక్టర్ వేణు గోపాల్,  సుషిత, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి, డాక్టర్ షాహ్నజ్  హాజరై మహిళల హక్కుల పై మహిళల అభివృద్ధి పై మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

త్వరలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం

Satyam NEWS

త్వరలో 250 కొత్త పంచాయతీలు

Bhavani

పెరిగిన జీతాలతో సహా బకాయిలు చెల్లించకపోతే పోరాటం ఉధృతం

Satyam NEWS

Leave a Comment