27.7 C
Hyderabad
April 26, 2024 03: 43 AM
Slider మహబూబ్ నగర్

మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలి

#WanaparthyCollector

పోక్సో, మహిళలపై లైంగిక వేధింపులు, గృహ హింస, చైల్డ్ ప్రొటెక్షన్, మహిళ చట్టాలపై అవగాహన కల్పించాలని,  జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి సీనియర్ సివిల్ జడ్జి వెంకట్రామ్,వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులకు సూచించారు. 

బుధవారం వనపర్తిలో ఎస్.పి. కార్యాలయం సమావేశ మందిరంలో మహిళల చట్టాలపై వనపర్తి జిల్లా న్యాయ సేవ అధికారుల ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి అండ్ సెక్రటరీ వెంకట్రామ్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. 

లైంగిక వేధింపుల నుండి పూర్తి రక్షణ

మహిళా చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పోక్సో చట్టం ద్వారా బాలికలకు లైంగిక వేధింపుల నుండి పూర్తి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అదే విధంగా నిందితులను కఠినంగా శిక్షించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.

18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అందరూ బాలికలే అని, 18 సంవత్సరాల లోపు బాలికలకు బాల్య వివాహాలు చేయటం మన జిల్లాలో జరుగుతున్నాయని నా దృష్టికి రావటంతో జిల్లాలో ‘సఖి’ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

18 సంవత్సరాల లోపు బాలికలకు, ప్రజలకు,  బాలల హక్కులు, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని ఆమె సూచించారు. అశ్లీల నేరాల నుండి బాలలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, వారికి రక్షణ కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఆయా గ్రామాలలో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు దృష్టికి వస్తే చైల్డ్ వెల్ఫేర్, సఖి కేంద్రం అధికారులకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు. 

సరైన సమయంలో వివాహం జరిగినట్లయితే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, బాల్య వివాహాల కారణంగా పుట్టబోయే పిల్లలు బలహీనంగా ఉంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. 14 సంవత్సరాల లోపు బాలలను పనులలో పెట్టుకున్న, వారిని ప్రోత్సహించిన చట్టరీత్యా నేరమని ఆమె అన్నారు. 14 సంవత్సరాల లోపు బాలలను పనులలో పెట్టుకున్నట్లు, లేదా వారిని హింసకు గురిచేసినట్లు సమాచారం అందితే ‘1098’ కు సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 

సీనియర్ సివిల్ జడ్జి అండ్ సెక్రటరీ ఎన్. వెంకట్రామ్ మాట్లాడుతూ మహిళల, బాల, బాలికల  చట్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించే బాధ్యత ప్రతి అధికారిపై ఉంటుందని ఆయన అన్నారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు వారికి  రక్షణ కల్పిస్తూ, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, బాలికల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల, పొక్సో, మహిళా చట్టాలపై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ  షాకిర్ హుస్సేన్, డి.డబ్ల్యూఓ పుష్పలత, ఆర్.డి.ఓ. అమరేందర్, డి.పి.ఓ. సురేష్ కుమార్, డీఈఓ. సుశీంద్ర రావు, డి.ఆర్.డి.ఓ. కోదండరాం, న్యాయవాదులు పుష్పలత, శశిబూషన్, ఎన్.జి.ఓ.లు  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

ఉత్సాహంగా ములుగు జిల్లాలో తెరాస గ్రామ కమిటీ ఎన్నికలు

Satyam NEWS

దొడ్డిదారిన కరెంటు చార్జీలు పెంచి బుకాయిస్తారా?

Satyam NEWS

అధికార వైసీపీకి దివంగత మహానేత రోశయ్యపై ఎందుకంత ప్రేమ?

Satyam NEWS

Leave a Comment