37.2 C
Hyderabad
March 29, 2024 19: 32 PM
Slider శ్రీకాకుళం

సమాన హక్కుల కోసం మహిళలు ఉద్యమించాలి: ఏ.పీ.టీ.ఎఫ్

#srikakulam

21వ శతాబ్దంలో కూడా మహిళలు అసమానతలకు, వివక్షకు గురి అవుతున్నారని, దీనిని అధిగమించేందుకు మహిళలే ఉద్యమించాలని, ఉద్యమాలతోనే ఇప్పటివరకు ఉన్న హక్కులను సాధించుకున్నాం అని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధవళ సరస్వతి అన్నారు.

ఈరోజు శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ లోని క్రాంతి భవన్లో ఏ పి టి ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ శైలజ మాట్లాడుతూ ఇప్పటికీ 75 సంవత్సరాల క్రితమే ఏపిటిఎఫ్ సంస్థను మాణిక్యాంబ ముందుండి నడిపించారని, ఆమె స్ఫూర్తితో మనం ఈనాడు ఉపాధ్యాయ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని పేర్కొన్నారు.

విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శ్రామిక మహిళా ఉద్యమ దినోత్సవంగా జరుపుకోవడం మహిళలకు మరింత స్ఫూర్తి దాయకం అన్నారు. మహిళల సమానతకు హక్కుల సాధనకు మహిళల ముందుండి నడిపించిన ఉద్యమాలే ఈనాటికి స్ఫూర్తిదాయకం అన్నారు.

ఏపీటీఎఫ్ మాజీ ఉపాధ్యక్షులు టి రమాదేవి మాట్లాడుతూ ఈరోజు మహిళా ఉపాధ్యాయులు అందరూ నేటి తరానికి మార్గదర్శకులు అని, గత తరం మహిళా ఉద్యమ కారుల స్ఫూర్తితో ఈనాడు మహిళా ఉపాధ్యాయులు అందరూ పని చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో మహిళలు సమాన హక్కుల కొరకు ఉద్యమాలు మరింత అవసరమని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ మహిళా ప్రతినిధి జినగ నీరజ మాట్లాడుతూ క్లారా జెక్టిన్, రోజా లక్సంబర్గ్, వంటి ఉద్యమ కారుల స్ఫూర్తితో మనం ముందుకు నడవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ జిల్లా  కార్యదర్శులు చావలి శ్రీనివాస్, దాసరి రామ్మోహనరావు, వి నవీన్ కుమార్, జిల్లా శాఖ ఉపాధ్యక్షులు పేడాడ అప్పలనాయుడు, బూర్జి మండల శాఖ అధ్యక్షులు ఏ శివరామకృష్ణ, సీనియర్ నాయకులు కె గోవిందరావు, రాష్ట్ర కౌన్సిలర్  సదాశివుని శంకరరావు, స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి తవిటమ్మ, కార్యకర్తలు  పద్మావతి, సుజాత, భాను, జనసాహితి  జిల్లా కార్యవర్గ సభ్యులు కంచరాన భుజంగరావు పెద్ద సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి

Bhavani

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి రాంచందర్ కి డాక్టరేట్

Bhavani

ఫుడ్ పాయిజనింగ్ విద్యార్ధుల్ని పరామర్శించిన షబ్బీర్ అలీ

Satyam NEWS

Leave a Comment