32.7 C
Hyderabad
March 29, 2024 13: 01 PM
Slider ముఖ్యంశాలు

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

#sandeepkumar

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర సెర్ఫ్ సిఇఓ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శితో కలిసి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపిక చేయబడిన జిల్లాల కలెక్టర్లతో  మహిళా సంఘాల పనితీరు , అభివృద్ది  పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంవత్సరానికి లక్ష ఆదాయం కల్పించే మహిళా సంఘాల సభ్యులకు సుస్థిర జీవనోపాదులు కల్పించి, ఆర్థికంగా బలోపేతం చేసి, పేదరిక నిర్మూలన ధ్యేయంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 8 జిల్లాలను ఎంపిక చేసినట్లు, అందులో ఖమ్మం ఒక జిల్లా అని అన్నారు.  మహిళా ఆర్థిక సాధికారత తో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం  జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో పాటు అన్నీ జిల్లాల కలెక్టర్ లు, డిఆర్దిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————-

Related posts

Free|Trial Cbd Hemp Harvest Process 9 Percent Cbd Hemp Flower

Bhavani

మహావీర్ ఇంజనీరింగ్ సర్వీస్ ను ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

చంద్రబాబు చేసిన ద్రోహాన్ని రైతులు మర్చిపోలేకపోతున్నారు

Satyam NEWS

Leave a Comment