39.2 C
Hyderabad
April 25, 2024 17: 42 PM
Slider నిజామాబాద్

లేడీస్ స్పెషల్: మహిళలకే కామారెడ్డి చైర్మన్, వైస్ చైర్మన్

kamareddy municipality

కామారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలు టిఆర్ఎస్ మహిళకు దక్కాయి. అధిక మెజారిటీతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎన్నిక సజావుగా సాగింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొదటి నుంచి అనుకున్నట్టుగానే టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు కూతురు నిట్టు జాహ్నవి చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు.

25 సంవత్సరాల చిన్న వయసులోనే చైర్మన్ పీఠాన్ని దక్కించుకున్నారు నిట్టు జాహ్నవి. ముందుగా మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ ప్రమాణస్వీకారానికి బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. తర్వాత క్యాంపు నుంచి ప్రత్యేక బస్సులో నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు టిఆర్ఎస్ కౌన్సిలర్లు. టిఆర్ఎస్ పార్టీకి 23 మంది కౌన్సిలర్లు ఉండగా ఇండిపెండెంట్ గా గెలిచిన ఆరుగురు కౌన్సిలర్లు ఇటీవల టిఆర్ఎస్ లో చేరడంతో టిఆర్ఎస్ బలం 29 కి చేరింది.

 వీరితో పాటు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిపి మెజారిటీ 30 కి చేరగా నిట్టు జాహ్నవి చైర్మన్ గా, గడ్డం ఇందుప్రియ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులచే ప్రమాణ స్వీకారం చేయించిన జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి వారికి పత్రాలను అందజేశారు. అనంతరం కామారెడ్డి పట్టణంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్బంగా చైర్మన్ నిట్టు జాహ్నవి మాట్లాడుతూ.. ఇంత చిన్న వయసులో తనపై పూర్తి విశ్వాసం ఉంచి చైర్మన్ గా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ లతో పాటు తనను ఎన్నుకున్న వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

Related posts

భారత్ తో యుద్ధం వస్తే మీదే బాధ్యత

Satyam NEWS

వ్యాన్‌లో 28 అస్థిపంజరాలు.. ఆశ్చర్యంలో భద్రతా దళాలు

Sub Editor

Leave a Comment