28.2 C
Hyderabad
April 20, 2024 13: 52 PM
Slider హైదరాబాద్

శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవం

#SrirangamFoundetion

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ కూకట్ పల్లి లోని శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలను శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్బంగా శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్, టీపీసీసీ అధికార ప్రతినిధి  Dr సత్యం శ్రీరంగం  మాట్లాడుతూ మహిళలకు అన్నిరంగాలలో అవకాశం కల్పిస్తున్నప్పటికీ  సమాజంలో వారిపై  చిన్న చూపు మాత్రం తగ్గడం లేదని అన్నారు.

మహిళలపై  దాడులు, వివక్షలు మాత్రం మాత్రం కొనసాగుతూనే ఉన్నాయన్నారు. కాలం మారుతున్నప్పటికీ మహిళలపై లైంగిక దాడులు అరికట్టడం తగ్గడం లేదన్నారు. మహిళలపై  దాడులు అరికట్టేందుకు మరిన్ని కఠినమైన చట్టాలు అమలు చేయాలనీ, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా మరింత ఎదిగేందుకు ప్రోత్సాహం కల్పించాలన్నారు.

మహిళలు అనే చిన్న చూపు తగ్గినపుడే మహిళలకు నిజమైన స్వతంత్రం  వచ్చినట్లు అవుతున్నదని మహిళా లేనిదే ప్రపంచం లేదని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన  అవసరం ఉందన్నారు. సమాజంలో స్త్రీలపై వివక్షను రూపు  మాపితేనే మహిళా సాధికారత సాదించినవారవుతామన్నారు.

ఈ కార్యక్రమంలో దుర్గారాణి , జ్యోతి ,లలిత ,సంధ్య ,సుజాత ,రమాదేవి ,భాగ్యలక్ష్మి ,జయమ్మ ,అనిత ,స్వప్న ,విజయలక్ష్మి అరుణ యాదవ్ ,విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జూబ్లీహిల్స్ లో భూ ప్రకంపనలు పెద్ద పెద్ద శబ్దాలు

Satyam NEWS

ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా : బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

వనపర్తిలో ఘనంగా వాసవిమాత ఆత్మార్పణ వేడుకలు

Satyam NEWS

Leave a Comment