39.2 C
Hyderabad
March 29, 2024 14: 53 PM
Slider నెల్లూరు

వి ఎస్ యు లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

#VikramaSimhapuri

నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉమెన్స్ సెల్,  యెన్ ఎస్. ఎస్  సంయుక్తముగా  అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యం చంద్రయ్య ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత ఆవశ్యకతను తెలియచేశారు. మహిళలు రాజకీయ, ఉద్యోగ,  పరిశ్రమలు  మరియు ఇతర రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు.

గతంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో మహిళలు అన్ని రంగాలలో మగవారికి ధీటుగా రాణిస్తున్నారని, దేశాభివృద్ధిలో, ఆర్థికాభివృద్ధిలో, పారిశ్రామికాభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తున్నారని  ఇది శుభపరిణామమని సంతోషం వ్యక్తం చేశారు.

విశిష్ట అతిధిగా విచ్చేసిన జిల్లా లోని ప్రముఖ న్యూరోలాజిస్ట్  ఆచార్య  బిందుమాధవి మహిళలు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకొని, వ్యాయాయం, పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని తెలిపారు.  మహిళలు తమ దిన చర్యను ప్రాధాన్యత అంశాలను భట్టి ప్రణాళికతో పూర్తి చేయడం వలన మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండగలరని అన్నారు.

ప్రతి మహిళా తాము ఎంచుకున్న రంగం ఎంచుకొని అందులో నైపుణ్యం సాధించాలని కోరారు. ఇంకొక విశిష్ట అతిథి పాలకుర్తి ఆండాళ్ దేవి మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల వివక్షత ఉందని, ఈ కోవిడ్  సందర్భంలో వివక్షత మరియు అసమానతలు ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, మహిళలు నాయకత్వం వహించినప్పుడు అసమానతలు తొలిగిపోతాయి  అని తెలిపారు. 

గౌరవ  అతిధిగా పాల్గొన్న రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారత అంశము చర్చిలకు పరిమఠం అయిందికాని దాని క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయాలని కోరారు.

సభాధ్యక్షురాలు ఆచార్య సుజా ఎస్  నాయర్ మాట్లాడుతూ విద్యార్థినులు లెర్నింగ్, లేబర్, లీడర్షిప్ ఏ అంశాలపై పట్టు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకురాలు డా. కె. సునీత, యెన్ ఎస్. ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, ఉమెన్ సెల్ సభ్యులు డా. వై విజయ, డా. శ్రీకన్యా రావు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఏమిటో కరెక్టుగా చెప్పగలరా?

Satyam NEWS

రానున్న రెండు వారాలు అత్యంత కీలక సమయం

Satyam NEWS

అగ్రిగోల్డ్ బాధితుల సదస్సు విజయవంతం చేయండి

Satyam NEWS

Leave a Comment