33.2 C
Hyderabad
April 26, 2024 00: 21 AM
Slider మహబూబ్ నగర్

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

#WanaparthyCollector

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో  ఎదగాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. సోమవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా జి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మహిళా దినోత్సవ  కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లాఎస్పీ అపూర్వ రావు  తో పాటు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు వారు చేసే పనిని చాలెంజిగా స్వీకరించి చేయాలన్నారు. మారుతున్న సాంకేతిక పద్ధతులను బట్టి మహిళలు కూడా ఎదగాలని సూచించారు. కోవిడ్  సమయంలో మహిళా ఉద్యోగుల విశేష సేవలందించారని ప్రశంసించారు. మహిళలు చదువుకుంటేనే అన్ని రంగాలలో ఎదగడానికి వీలుంటుంది అన్నారు.

ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. ఒక మహిళ చదువుకుంటే సమాజం ఇల్లు బాగుంటుందని అన్నారు. అనంతరం ప్రభుత్వ శాఖలో విశేష సేవలు అందించిన మహిళా ఉద్యోగినులకు అవార్డులు అందజేశారు.

డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డి డబ్ల్యూ ఓ పుష్పలత, డి ఆర్ డి ఎ కోదండం, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డబ్ల్యూ కృష్ణ చైతన్య, సిడిపిఓలు సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

రాత్రి సమయంలో రోడ్ల పైకి విజయనగరం లేడీ పోలీస్..!

Satyam NEWS

విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో 17 చోట్ల తనిఖీలు…!

Satyam NEWS

అంతర్ జాతీయ పవర్ లిఫ్టర్ సాఖీబ్ బాషకు ఎంపీ ఆదాల సత్కారం

Satyam NEWS

Leave a Comment