38.2 C
Hyderabad
April 25, 2024 11: 01 AM
Slider సంపాదకీయం

పని చేసే సంస్కృతి పెంచుకుందాం రండి

#WorkCulture

మూడు రోజుల పండుగ ముగింపుకు వచ్చింది. బోగి, సంక్రాంతి, కనుమ అనే ఈ మూడు రోజుల పండుగను సంప్రదాయబద్దంగా ఎంత మంది జరుపుకున్నారు? సంక్రాంతి పండుగ రైతుల పండుగ.

ఏ రోజూ కష్టాలగడప దాటలేని రైతు పండుగలు ఏం చేసుకుంటాడు? రైతు పేరు చెప్పి రైతులు కానివారంతా చేసుకోవాలి. పండగ చేసుకోవడం అంటే శలవు తీసుకోవడం గా మారిపోయిన ఈ రోజుల్లో సంప్రదాయబద్దంగా పండగ జరుపుకోవడమనే మాటకు అర్ధం లేదు.

పండుగకు శని, ఆది వారాలు కలిసి వస్తే అదే నిజమైన పండుగగా మారిపోయింది. ఎన్ని ఎక్కువ రోజులు శెలవు ఉంటే అంత పెద్ద పండగ అనే అర్ధం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా శని ఆది వారాలు, ఎక్కువ రోజులు శెలవులు ఇచ్చే పండుగలు వస్తున్నాయంటే భయం వేసే పరిస్థితి.

కుంటుబడిన ప్రగతి రధాన్ని నడిపించాలి

అసలే మన దేశంలో పండుగలు ఎక్కువ. ఏ మతం పండగ వచ్చినా అందరికి శెలవే. బహుశ ఇదే నిజమైన ప్రజాస్వామ్యమేమో తెలియదు కానీ అలాగే జరుగుతున్నది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశం మొత్తం స్తంభించి పోయింది. ఆర్ధిక రధ చక్రాలు ఆగిపోయాయి. ప్రగతి కుంటుపడింది.

ఈ పరిస్థితి నుంచి కోలుకోవాలంటే దేశం మొత్తం ఎంతో కష్టపడాల్సిన ఈ తరుణంలో పండుగల పేరుతో శెలవు తీసుకోవడం కరెక్టా? ఒక్క సారి ఆలోచించండి. 365 రోజుల్లో దాదాపుగా 60 రోజుల పాటు ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది. ఆదివారాలు ఇతర శలవు రోజులు కలిపితే ఇది వంద దాటుతుంది.

కాలయాపన చేస్తే అధోగతే

దేశ ఉత్పాదకత పెంచుకుంటేనే దేశం పురోగమిస్తుంది. శలవుల పేరుతో కాలయాపన చేసుకుంటూ పోతే కరోనా ఎఫెక్టు నుంచి దేశ ఆర్ధిక వ్యవస్థ బయటపడటానికి పదేళ్లు పడుతుంది. కనీసం నాలుగైదేళ్లు పండగల పేరుతో కాలయాపన చేయకుండా, శెలవులు అంటూ ఎంజాయ్ చేయకుండా కష్టపడితే కరోనా ఎఫెక్టు నుంచి త్వరగా బయటపడతాం.

దేశం మళ్లీ పురోగమిస్తుంది. ఆలోచించండి. ఈ కొత్త సంవత్సరంలో వ్యక్తిగత రిజల్యూషన్స్ కాకుండా సామూహికంగా రిజల్యూషన్ తీసుకోవడం అవసరం. పండగల పేరుతో శెలవులు వద్దు. కష్టపడి పని చేద్దాం. ఎవరి రంగంలో వారు కష్టపడితే తప్ప దేశం ముందుకు వెళ్లదు.

ఇన్ని రోజుల శెలవులు అనవసరం

ఏ పండుగ వచ్చినా ఉదయమో, సాయంత్రమో కొన్ని గంటల పాటు కాలక్షేపం చేసి మళ్లీ ఎవరికి వారు పనుల్లో మునిగి పోవాలి. రోజుల తరబడి పండగల పేరుతో శెలవులు తీసుకోవడం ఈ ఏడాది నుంచి మానివేయాలి. వరుసగా ఐదు రోజులు, ఆరు రోజులు శెలవులు తీసుకుని పని గంటలను తగ్గించుకోవద్దు.

అన్ని రంగాలలోని వారు ఇలా కష్టపడితే తప్ప దేశం ముందుకు వెళ్లే అవకాశం లేదు. ఆరోగ్య పరంగానో  వ్యక్తిగతంగానో ఇబ్బందులు ఉన్న వారు మాత్రమే శెలవు తీసుకోవాలి తప్ప ఆరోగ్యం గా ఉన్నవారు శెలవులు తీసుకోకుండా పని చేయాలి.

ఈ ప్రతిపాదన పై ఆలోచించండి. నిర్ణయం ప్రభుత్వానికి వదిలేయవద్దు. ప్రజలే తీసుకోవాలి. పని చేయాలి…. పని చేయాలి… ఎవరి పని వారు చేయాలి… అంతే.

Related posts

జీఎస్టీ పరిహారం మొత్తాన్ని కేంద్రమే చెల్లించాలి

Satyam NEWS

మహమ్మారి వ్యాపించకుండా కట్టు దిట్టమైన చర్యలు

Satyam NEWS

విజయవాడలో నంది అవార్డుల ప్రదానోత్సవం

Satyam NEWS

Leave a Comment