ఉపాధ్యాయ దినోత్యవం పురస్కరించుకుని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విద్యా విభాగం ఆధ్వర్యంలో నూతన విద్యావిధానం వర్క్ షాప్ నిర్వహించారు. నూతన విద్యావిధానం అవలంచించటం ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు ఏ విధంగా లాభపడతారనే అంశాన్ని ఈ వర్క్ షాప్ లో వివరించారు. హైదరాబాద్ లోని మహాత్మ గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఈ “నయీ తాలీమ్” వర్క్ షాప్ కు సహకరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్. సుదర్శనరావు ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ అఫ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ వారు రూపొందించిన “నయీ తాలీమ్” విద్యార్ధుల నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా ఉందని అన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భం గౌరవనీయులు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి మరీ ముఖ్యంగా విద్యారంగానికి అందించిన విలువైన సేవలను ఆయన గుర్తు చేశారు. ఎక్కడో మారుమూల గ్రామం లోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, ఈ దేశానికి అనేకమైనటువంటి అత్యున్నత సేవలు చేయగలిగారంటే దానికి కారణం ఉపాధ్యాయ వృత్తి ని ఎంచుకోవడమే అని తెలిపారు. డిజిటలైజషన్ ప్రాచూర్యం పొందుతున్న ఈ రోజులలో కూడా గురువు కి ప్రత్యామ్నాయం లేదని సుదర్శనరావు అన్నారు. ఇప్పటి విద్యార్థిని విద్యార్థులు తమ గురువుని గౌరవించి మంచి స్థాయికి ఎదగాలని కొందరు శిష్యుల ద్వారా గురువులకు కూడా పేరుప్రఖ్యాతలు వస్తాయని ఆయన అన్నారు.
విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. అంధే ప్రసాద్ ఈ కార్యక్రమం లో ఈ నూతన ప్రణాళిక పైన, వాటి ఉపయోగాల గురించి తెలియ చేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా శిక్షణా కార్యక్రమం నిర్వాహకురాలు డా. ఆర్ .మధుమతి కార్యక్రమము లో పాల్గొన్న అధ్యాపకుల నుంచి నూతన పద్ధతుల పైన వారి వారి అభిప్రాయాలను లిఖిత పూర్వకం గా సేకరించారు. చివరగా పాల్గొన్న అధ్యాపకులందరికి రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ జవహర్ బాబు సర్టిఫికెట్ అంద చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో విద్యా విభాగం అధ్యాపకులుడా.కే.కవిత, ఏ.వి.ఎస్. ప్రసన్న, సంధ్య, శివపార్వతి, ఎడ్యుకేషన్ విభాగ విద్యార్థులు విశ్వవిద్యాలయాల వివిధ విభాగాల అధిపతులు,అధ్యాపకులు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.