33.2 C
Hyderabad
April 26, 2024 01: 31 AM
Slider మహబూబ్ నగర్

కలిసి పనిచేసి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం

#Mallu Ravi

ప్రజాస్వామ్య తెలంగాణలో ప్రజల నాడి తెలుసుకొని ప్రజల గొంతుగా ఉద్యమించే రేవంత్ రెడ్డి కి ఏఐసీసీ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షులుగా నియమించడం సముచిత నిర్ణయమని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు.

అధిష్ఠానం టీపీసీసీ లో లోతుగా చర్చించి వందలాది మంది అభిప్రాయలను తీసుకున్న తర్వాతనే ఏఐసీసీ రేవంత్ రెడ్డిని ప్రసిడెంట్ గా నియమించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ లతో పాటు కార్యదర్శులకు టీపీసీసీ నాయకులకు మల్లు రవి కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కేసీఆర్ అప్రజాస్వామ్య రాజకీయాలను ఎదిరించి పోరాటం చేయాలంటే కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని అధిష్టానం నిర్ణయాలను అంగీకరించి పని చేయాలని ఆయన అన్నారు.

Related posts

బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు

Satyam NEWS

పదిరోజుల్లో రెండోసారి మోడీ కాశీ పర్యటన

Sub Editor

గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన అసెంబ్లీ స్పీకర్

Satyam NEWS

Leave a Comment