39.2 C
Hyderabad
April 23, 2024 15: 29 PM
Slider గుంటూరు

ఆత్మస్థైర్యంతో పని చేయండి…అధికారం మళ్ళీ మనదే

#Marri Rajasekhar

అధికారం మళ్లీ మనదేనని, రానున్నది జగనన్న ప్రభుత్వమేనని , క్షేత్రస్థాయిలో కార్యకర్తలు నాయకులు, సమన్వయంతో, సమర్థవంతంగా పని చేయాలని గుంటూరు, కృష్ణ ,ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్ అన్నారు. శనివారం నియోజకవర్గ కార్యాలయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండల గృహ సారధులు, కన్వీనర్ల సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ పారదర్శక సంక్షేమం, సుపరిపాలన సాగాలంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలన్నారు. అది మీ చేతుల్లోనే ఉందన్నారు. ప్రతి గడప గడపకు అంబటి రాంబాబు సుపరిచితమేనని, ఇక్కడ రాంబాబును రాష్ట్రంలో జగన్ ను గెలిపించాలని కోరారు.

మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల యుద్ధానికి సైన్యం సిద్ధంగా ఉందని, జగనన్న రథచక్రాల కింద పవన్ ,బాబులు తునాతునకలు కావడం ఖాయమన్నారు. ఎంతమంది ఏకమైనా జగన్ విజయాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. విజయ సంకల్పంతో కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన వ్యవస్థ క్షేత్రస్థాయిలో మనకు ఉందని, దీని వినియోగించుకుందామన్నారు. గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, జెసిఎస్ ఇన్చార్జులు సమిష్టిగా పని చేస్తే విజయడంకా మోగుతుందన్నారు.

పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు డా.గీతా హసంతి మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ఈ ప్రభుత్వం నిదర్శనమన్నారు .నియామక పదవుల్లోనూ అత్యధిక శాతం మంది మహిళలు ఉండటం అభినందనీయమన్నారు.

నియోజకవర్గ పరిశీలకులు వెన్నా హనుమారెడ్డి మాట్లాడుతూ..అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. 98 శాతం హామీలు అమలు చేసిన ఘనత యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుకుతుందన్నారు. మంత్రిగా ఉంటూనే నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న అంబటి రాంబాబును మీరందరూ బలపరచాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు,రాష్ట్ర వ్యవసాయ సలహామండలి సభ్యులు కళ్ళం విజయ భాస్కర రెడ్డి, జడ్పిటిసి సభ్యులు సంకటి నాగేశ్వరమ్మ, జేసియస్ మండల ఇంచార్జ్ చిలక జైపాల్, నాయకులు యలవర్తిపాటి ఈసా, కట్టా సాంబయ్య, ధూళిపాళ్ల బ్యాంక్ చైర్మన్ నలబోతు శివన్నారాయణ, పలు గ్రామాల సర్పంచులు, నాయకులు, తదితరులున్నారు.

Related posts

ప్రతి ఒక్కరు ఓటుహక్కు వినియోగించుకోవాలి

Bhavani

శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు విరాళం అందచేత

Satyam NEWS

అక్టోబ‌ర్ 11న ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి సిరిమానోత్స‌వం

Satyam NEWS

Leave a Comment