26.2 C
Hyderabad
December 11, 2024 20: 51 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ విలీన ప్రక్రియకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు

IMG_0097

ఏపీఎస్ ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ గ్రూప్ ను నియమించింది. ఈ వర్కింగ్ గ్రూప్ లో ఆర్ధిక, సాధారణ పరిపాలన, రవాణ, న్యాయ శాఖల ఉన్నతాధికారులు ఉంటారు. మొత్తం ఏడుగురు సభ్యులతో ఈ వర్కింగ్ గ్రూపును నియమిస్తూ జీవో ను జారీ చేశారు. వచ్చే నెల 15వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని వర్కింగ్ గ్రూపునకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. ప్రజా రవాణా శాఖ ఏర్పాటు.. పోస్టులు.. డిజిగ్నేషన్ల ఏర్పాటుపై వర్కింగ్ గ్రూప్ దృష్టి సారిస్తుంది. అదే విధంగా జీతాల చెల్లింపులు.. పే-స్కేల్ వంటి అంశాల్లో విధి విధానాలను కూడా వర్కింగ్ గ్రూప్ ఖరారు చేయనున్నది.

Related posts

పివోకే పై చర్యలకు పావులు కదుపుతున్నారా?

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన యూట్యూబ్ స్టార్ భాను

Satyam NEWS

త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ

Satyam NEWS

Leave a Comment