40.2 C
Hyderabad
April 19, 2024 17: 09 PM
Slider మహబూబ్ నగర్

కార్యక్రమాలను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలి

#wanaparthy

నర్సరీల నిర్వహణ, తెలంగాణ క్రీడా ప్రాంగణాల కార్యక్రమాలను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఐ డి ఓ సి. సమావేశ మందిరంలో తెలంగాణకు హరితహారం, నర్సరీలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు కార్యక్రమాలపై అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నర్సరీలు, ప్లాంటేషన్ పనులను పర్యవేక్షించాలని, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

లక్ష్యానికి అనుగుణంగా  మొక్కలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి  చేయాలని ఆమె తెలిపారు. పనులపై ఎప్పటికప్పుడు నివేదికలను సమర్పించాలని అధికారులకు ఆమె ఆదేశించారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సహిస్తున్నదని ఆమె తెలిపారు. పనులలో జాప్యం లేకుండా త్వరిత గతిన పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జెడ్.పి. సీఈవో వెంకటరెడ్డి, డి ఆర్.డి.ఓ. నరసింహులు, డిపిఓ సురేష్, యం.పి.డి. ఓ. లు యం.ఆర్.ఓ లు, అధికారులు, సిబ్బంది,  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

టీ20: ఫామ్ లో ఉన్న భారత్ గెలుపు సుళువే

Satyam NEWS

Analysis :మాయదారి చైనా మన దారికి వచ్చేనా?

Satyam NEWS

డబ్బులు మీరు పంపి మాపై నెడితే ఏం చేయాలి?

Satyam NEWS

Leave a Comment