27.7 C
Hyderabad
April 18, 2024 10: 55 AM
Slider నల్గొండ

ప్రపంచ క్యాన్సర్ డే: డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

#World Cancer Day

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని బసవతారకం క్యాన్సర్ హాస్పటల్లో ‘బి’ నెగిటివ్ రక్తదానం డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాటి శీను శనివారం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కుర్రి శంభమ్మ కు రక్తం కావాలని వైద్యులు చెప్పగానే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన తాటి శ్రీను కి ఫోన్ ద్వారా విషయం చెప్పటంతో వెంటనే స్పందించి

బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది.డి.ఎస్.ఆర్ ట్రస్ట్ తరపున 4 యూనిట్లు రక్తం ఇప్పించడం జరిగిందని తెలిపారు.క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ,గుర్తింపును,చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4న, ప్రపంచ క్యాన్సర్ డే గా గుర్తించడం జరిగిందని అన్నారు.

ఈ వ్యాధి ప్రతి ఒక్కరిని కబళిస్తుందని,సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని,ఈ మహమ్మారి గురించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి, చికిత్సను ప్రోత్సహించేందుకు ఫిబ్రవరి 4న, ప్రపంచ క్యాన్సర్ డేగా ప్రకటించారని, క్యాన్సర్ పేషెంట్లకి కావాల్సిన ట్రీట్‌మెంట్‌ కంటే ముందుగా ఓదార్పు,భరోసా కావాలి బాబురావు అన్నారు.డి ఎస్ ఆర్ ట్రస్ట్ తరఫున ఇప్పటికీ 12 మార్లు రక్తదానం చేసిన తాటి శ్రీను కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఆర్ ట్రస్ట్ సభ్యులు పరిటాల నాగరాజు,దగ్గుపాటి సత్యానందం,చింతమల ప్రసాద్,కోల్లపూడి కళ్యాణ్,మామిడి అశోక్,దగ్గుపాటి కవిత,దగ్గుపాటి సురేష్,పొదిల తిరుపతి, మామిడి రాజేష్,దగ్గుపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

తెలంగాణ కు ఉరుములతో కూడిన వర్ష సూచన

Satyam NEWS

కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలపై పోరుబాట

Satyam NEWS

భూతద్ధం భాస్కర్‌ నారాయణగా శివ కందుకూరి నటించిన సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌

Satyam NEWS

Leave a Comment